SKLM: ‘జుత్తు’ ఆశయాలు ఆచరణీయమైనవని పలువురు వక్తలు ప్రశంసించారు. మందస మండలం బేతాళపురం గ్రామంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే కీ. శే జుత్తు జగన్నాయకులు 66వ జయంతి వేడుకలను వైసీపీ శ్రేణులు నిర్వహించారు. పలాస శాసనసభ్యునిగా జగన్నాయకులు చేసిన సేవలను కొనియాడారు. అభివృద్ధి ప్రదాతగా జుత్తు ఈ ప్రాంత ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.