ATP: గుత్తి పట్టణంలోని రాజీవ్ గాంధీ సర్కిల్లో ద్విచక్ర వాహనం డివైడెర్ను ఢీకొని అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులకి తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు.