• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

MURDER: బ్యాంకు ఉద్యోగి దారుణ హత్య

TG: వరంగల్ జిల్లా రంగంపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు కాకతీయ గ్రామీణ బ్యాంకు ఉద్యోగి రాజమోహన్‌ను కాళ్లు, చేతులు కట్టేసి హత్య చేశారు. కారులో మృతదేహాన్ని వదిలిపెట్టి వెళ్లారు. సీసీ ఫుటేజ్‌లో నిందితుల దృశ్యాలు కనిపించినట్లు సమాచారం. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 3, 2024 / 01:41 PM IST

తెలుగు గంగ ప్రధాన కాలువ అక్విడెక్టుకు గండి

CTR: వరదయ్యపాళ్యం మండలం సిద్ధాపురం సమీపంలోని 129 కిలోమీటర్ వద్ద తెలుగు గంగ ప్రధాన కాలువ అక్విడెక్టుకు గండి పడింది. ఈ గండి కాస్త పెద్దదైతే ప్రధాన కాలువకే గండి పడే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. గతంలో అక్విడెక్టు వద్ధ స్వల్ప కాలిక లీకేజీ ఉండేదని.. ప్రస్తుతం ఆ లీకేజీ ఎక్కువై గండి పడినట్లు చెప్పుకొచ్చారు. 

December 3, 2024 / 12:20 PM IST

కావలి హైవే వద్ద లోయలో పడిన లారీ

NLR: కావలి హైవే వద్ద అల్లిగుంటపాలెం జంక్షన్ సమీపంలో మంగళవారం ఉదయం 4 గంటలకు లారీ లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘటనా స్థలానికి నేషనల్ హైవే పోలీసులు వచ్చి క్రేన్లు సహాయంతో లారీని బయటకు తీశారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

December 3, 2024 / 11:20 AM IST

పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

MBNR: చిన్నచింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన విజయ్ (16) మంగళవారం ఉదయం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించి 108 వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసే సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, విజయ్ చిన్నచింతకుంటలో పదో తరగతి చదువుతున్నాడు.

December 3, 2024 / 11:01 AM IST

అమలాపురం ప్రేమజంట ఆత్మహత్య

కోనసీమ: విశాఖ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య పాల్పడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అమలాపురానికి చెందిన సుష్మిత, దుర్గారావు కుటుంబాలు బ్రతుకుదెరువు కోసం షీలానగర్‌లో నివాసం ఉంటున్నారు. సుష్మిత, దుర్గారావుకు మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇరుకుటుంబాలు ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వారు ఓ అపార్ట్‌మెంట్ పైనుంచి దూకేశారు.

December 3, 2024 / 10:59 AM IST

బంగ్లాలో చిన్మోయ్ లాయర్‌పై ఇస్లామిస్టుల దాడి

బంగ్లాదేశ్‌లో అరెస్టయిన హిందూ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్ తరపున వాదిస్తున్న న్యాయవాది రామన్ రాయ్‌పై తాజాగా ఇస్లామిస్టులు దాడికి పాల్పడ్డారు. ‘ఇస్లామిస్టులు అతని ఇంటిపై క్రూరంగా దాడి చేశారు. ప్రస్తుతం అతడు ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. చిన్మోయ్ తరపున మాట్లాడటమే అతను చేసిన అతి పెద్ద తప్పు’ అని ఇస్కాన్ కోల్‌కతా అధికార ప్రతినిధి రాధారమన్ దాస్ ఎక్స్ వేదికగా తెలిపారు.

December 3, 2024 / 10:41 AM IST

బైక్‌ను ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి

W.G: పెనుమంట్ర మండలం మార్టేరులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మార్టేరు నుంచి పెనుగొండ వెళ్లే రోడ్డులో బైక్ పై వెళుతున్న ఇద్దరు యువకులను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందగా.. గాయాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

December 3, 2024 / 10:36 AM IST

చెట్టును ఢీకొన్న కారు.. యువకుడు మృతి

అన్నమయ్య: వాల్మీకిపురంలోని టీఎంలోయ వద్ద మంగళవారం వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొని యువకుడు దుర్మరణం చెందినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. కలికిరికి పట్టణం, శివాలయం వీధిలో ఉండే అబ్దుల్ల కొడుకు అశ్రఫ్ (27) మదనపల్లె నుంచి కలికిరికి వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. 

December 3, 2024 / 10:28 AM IST

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అక్కా, తమ్ముడు

WNP: రోడ్డు ప్రమాదంలో వనపర్తి జిల్లాకు చెందిన అక్కాతమ్ముడు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొత్తకోట మండలం కానాయపల్లికి చెందిన మనోజ్(25), అక్క పద్మ(31) ఆమె కుటుంబంతో కుంట్లూర్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో కోహెడ-పెద్దఅంబర్‌పేట ఔటర్‌రింగ్‌ రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. వీరి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో మనోజ్, పద్మ మృతిచెందారు. మృతుల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస...

December 3, 2024 / 10:28 AM IST

చెన్నేరి వద్ద రోడ్డు ప్రమాదం

CTR: సత్యవేడు మండలం చెన్నేరి గ్రామం వద్ద ఎదురెదురుగా బైకులు ఢీకొనడంతో వాహనదారులు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. చెన్నేరి మాదిగవాడకు చెందిన శ్రీనివాసులు తమిళనాడు ఊతుకోట నుంచి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో పుదుకుప్పం గ్రామానికి చెందిన భార్గవ్ కూడా తలకు గాయమైనట్టు సమాచారం.

December 3, 2024 / 10:08 AM IST

పామిడిలో కరెంటు షాక్‌తో యువకుడి దుర్మరణం

ATP: పామిడి పట్టణం బ్రాహ్మణ వీధికి చెందిన వెంకటేశ్ అనే యువకుడు నిన్న రాత్రి కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. పట్టణంలోని సంతమార్కెట్ వీధిలో ఓ రేకుల షెడ్డు కింద స్నేహితులతో కూర్చొని మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు.

December 3, 2024 / 09:56 AM IST

జిల్లాలో ఇష్టారాజ్యంగా అక్రమ ఇసుక రవాణా

BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాక పంచాయతీ పరిధిలో గల గాంధీ నగర్ నుండి అక్రమ ఇసుక రవాణా విచ్చలవిడిగా చేస్తున్నారని మంగళవారం స్థానికులు అగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంతో వాహనాలను నడుపుతున్నారని.. దీని వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. రెవెన్యూ శాఖ అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

December 3, 2024 / 09:52 AM IST

బస్సు, కారు ఢీ.. ఐదుగురు MBBS విద్యార్థులు మృతి

కేరళలో బస్సును కారు ఢీకొనడంతో ఐదుగురు MBBS విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి 9 గం.లకు కారులో ఏడుగురు విద్యార్థులు అతి వేగంతో వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను మహమ్మద్, ముహాసిన్, ఇబ్రహీం, దేవానంద్, శ్రీదీప్‌లుగా అధికారులు గుర్తించారు. ఐదుగురు విద్యార్థుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మరణించినట్లు అధికార...

December 3, 2024 / 08:53 AM IST

ట్రాక్టర్ ఢీకొని తండ్రి, కుమార్తెకు తీవ్ర గాయాలు

అన్నమయ్య: ట్రాక్టర్ ఢీకొని తండ్రి, కుమార్తె తీవ్రంగా గాయపడినట్లు గుర్రంకొండ ఎస్సై మధు రామచంద్రుడు తెలిపారు. గుర్రంకొండ పట్టణంలో ఉండే షేక్ రిజ్వాన్(47), అదే ఊరిలోని ఇందిరమ్మ కాలనీలో కాపురం ఉంటున్న తన అన్న కుమార్తె పైజుల 9నెలల గర్భవతి కావడంతో ఆమెను తన అన్న ఇంటికి తీసుకురావడానికి వెళ్లాడు. సోమవారం రాత్రి అన్న కూతుర్ని తీసుకొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

December 3, 2024 / 08:33 AM IST

తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య

ELR: కైకలూరుకి చెందిన నాదెళ్ల వెంకటేశ్(28) తల్లితో కలిసి ఇండియన్ బ్యాంకు సమీపంలో నివసిస్తున్నారు. మద్యానికి బానిసైన వెంకటేష్ తరచూ తాగి ఇంటికి వస్తుండటంతో తల్లి తాగొద్దని మందలిస్తూ ఉండేది. సోమవారం కూడా తాగి రావడంతో తల్లి అసహనం వ్యక్తం చేసింది. దీంతో వెంకటేశ్ ఇంట్లో ప్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్మ చేసుకున్నాడు.

December 3, 2024 / 07:44 AM IST