KKD: పెద్దాపురంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తాటాకుల ఇల్లు దగ్ధం అయింది. గురువారం పెద్దాపురంలోని వీర్రాజుపేటలో మాడ మల్లికార్జున తాటాకు ఇంటిపై తారాజువ్వ పడి ఇల్లు దగ్ధం అయింది. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగకపోయినా, సుమారు రూ.50,000 ఆస్తి నష్టం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు.
ఏలూరు: తూర్పు వీధి గౌరమ్మ గుడి వద్ద గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. దీపావళి బాణసంచా తీసుకెళ్తుండగా బైక్ అదుపుతప్పి గోతిలో పడింది. ఈ సమయంలో బాణసంచా పేలిపోవడంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఏలూరు 1టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పండగపూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో 6గురు మృతి చెందగా 5గురు గాయపడిన ఘటన యూపీలో చోటుచేసుకుంది. మీరట్ హైవేపై వెళ్లున్న టెంపోను ట్రాక్టర్ ఢీకొట్టడంతో అందులో ఉన్న 6గురు మృతి చెందారు. అనంతరం వచ్చిన కారు డివైడర్‌ను ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 5గురు గాయపడ్డారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు...
KKD: సామర్లకోట మండలం పి. వేమవరం గ్రామానికి చెందిన ఆనాల భూషణం మృతదేహం గురువారం ఉదయం పి. వేమవరం పంట కాలువలో లభ్యమైంది. బుధవారం రాత్రి బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మరణించి ఉంటారని గ్రామస్థులు భావిస్తున్నారు. పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
AP: విజయవాడలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. శిరీష అనే మహిళ తన తల్లి వజ్రమ్మను ప్యాసింజర్ రైలు ఎక్కించేందుకు రైల్వేస్టేషన్‌కు వెళ్లింది. పట్టాలు దాటుతూ.. 3వ ప్లాట్‌ఫ్లాం వద్ద వజ్రమ్మకు సాయం చేయబోయింది. ఈ క్రమంలో వేగంగా వచ్చిన కోయంబత్తూర్ ఎక్స్‌ప్రెస్ రైలు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.
KMR: సదాశివ నగర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తిని గొడ్డలితో తలపైన నరికి దారుణంగా హత్య చేశారని ఎస్సై రంజిత్ కుమార్ తెలిపారు. ఈ వ్యక్తి ఫోటోను ఎవరైనా గుర్తు పడితే తమ సెల్ ఫోన్ నెంబర్లను సంప్రదించాలని చెప్పారు. ఎస్సై రంజిత్ కుమార్ సెల్ నెంబర్ :8712686164,8712686163 లను సంప్రదించాలని పేర్కొన్నారు. పథకం ప్రకారం హత్య చేసి ఉంటారన్నారు.
AP: విశాఖ SBI మెయిన్ బ్రాంచ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. SBI శాఖ నిర్వహిస్తున్న భవనం నుంచి పొగలు వచ్చాయి. దీపావళి కారణంగా సెలవు కావడంతో బ్యాంకు తెరవలేదు. లోపల నుంచి పొగలు రావడంతో స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది బ్యాంక్ డోర్లు పగలగొట్టి మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
NDL: నంద్యాల రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని మహిళ గురువారం తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మహిళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. వివరాలు తెలిస్తే 9441509497 నంబర్‌కు ఫోన్ చేసి తెలపాలని రైల్వే పోలీసులు కోరారు.
అన్నమయ్య: అతిగా మద్యం తాగి మదనపల్లిలో వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. సీఐ రామచంద్ర కథనం.. స్థానిక సీటీఎం రోడ్డులోని మీసేవ సమీపంలో రోడ్డు పక్కన అతిగా మద్యం తాగి ఓ వ్యక్తి క్కడే ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ALR: దీపావళి రోజు అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సీపట్నం నుంచి మద్దిగరువులో జరిగే వారపు సంత వెళ్తుండగా చింతపల్లి ఘాట్ రోడ్డు సమీపంలో బొలోరో.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడగా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
AP: తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సూర్యారావుపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగు పడింది. ఈ ఘటనలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
BHPL: భూపాలపల్లి మండలంలోని ఆజంనగర్‌లో షాట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన మహేశ్వరపు కొమురయ్య ఉదయం కాళేశ్వరం దైవదర్శనానికి ఇంటిల్లిపాది వెళ్లారు. సుమారు 2 గంటల ప్రాంతంలో షాట్ సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు స్థానికులు తెలిపారు.
తూర్పు స్పెయిన్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 95కి చేరినట్లు తెలుస్తోంది. అనేక మంది ఆచూకీ తెలియరాలేదు. అలాగే వరదల్లో వందల కార్లు కొట్టుకుపోయాయి. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దేశంలో డిజిటల్ వినియోగం పెరగడంతో సైబర్ దాడులు కూడా అత్యధికంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2033 నాటికి భారత్ ఏటా దాదాపు లక్ష సైబర్ దాడులను ఎదుర్కొంటుందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్య 2047 నాటికి 17 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఇటీవల ఎయిమ్స్, ప్రధాన విమానయాన సంస్థల నెట్‌వర్క్‌పై భారీగా సైబర్ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.
MDK: తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురై బ్రెయిన్ డెడ్‌తో బాలిక మృతి చెందిన ఘటన నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ మేరకు గ్రామస్తులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చల్మెడ గ్రామానికి చెందిన బొమ్మని కనకరాజు లత దంపతుల కుమార్తె తనుశ్రీ( 7)రెండవ తరగతి చదువుతుంది. గురువారం నాడు సాయంత్రం తీవ్ర జ్వరంతో అస్వస్థకు లోనై ఫిట్స్ రావడంతో మరణించడం జరిగింది.