NLG: నల్లగొండ జిల్లా చిట్యాల రైల్వే స్టేషన్ సమీపంలోని వ్యవసాయ పొలంలో శనివారం మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన గవర్నమెంట్ ఆఫీసర్ ప్రసాద్‌గా గుర్తించారు. మృతదేహంపై గాయాలు ఉండడంతో ప్రసాద్‌ను ఎక్కడో హత్య కేసు మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.