ASR: చింతూరు మండలం వీరాపురం వద్ద శనివారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు వైపు నుంచి కుంట వైపుకు ఫ్రూట్ లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తా కొట్టింది. వ్యానులో ముగ్గురు ఉండగా.. వీరిలో తీవ్ర గాయాలైన ఒకరు మృతి చెందినట్టు సమాచారం. ఘటనపై చింతూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.