VZM: శృంగవరపుకోట ముంతాజ్ హోటల్లో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. వంట గదిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హోటల్లో మూడో ఫ్లోర్‌ను పొగ కమ్మేయడంతో సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసి సహాయక చర్యలు చేపట్టారు.