TG: మెదక్ జిల్లా మాడిగి RTA చెక్పోస్ట్ వద్ద 800 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ముంబైకి లారీలో తరలిస్తున్న గంజాయిని పూణె, గోవా రాష్ట్రాలకు చెందిన DRI స్పెషల్ఫోర్స్ అధికారులు వెంబడించగా..లారీ డ్రైవర్.. చెక్పోస్ట్ వద్ద వాహనాన్ని వదిలి పారిపోయాడు. డ్రైవర్ ఎంతసేపటికి రాకపోవడంతో లారీని పరిశీలించగా గంజాయి విషయం బయటపడింది. వెంటనే గంజాయిని ఇరు రాష్ట్రాల అధికారులు సంయుక్తంగా సీజ్ చేశారు.