కడప: పెండ్లిమర్రి మండలం గోపరాజుపల్లి గ్రామంలో నంద్యాల సుబ్బరాయుడు అలియాస్ సుబ్బయ్యపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి దాడి చేశాడు. గతంలో వీరి మధ్య పాత కక్షలు ఉండేవని దాని మనసులో పెట్టుకొని ఈ దాడి చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో గాయపడ్డ సుబ్బయ్యను చికిత్స కోసం 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.