• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

మహిళతో అసభ్య ప్రవర్తన.. హెడ్‌ కానిస్టేబుల్‌పై కేసు

AP: మహిళా హోంగార్డుతో అసభ్య ప్రవర్తించిన హెడ్‌ కానిస్టేబుల్‌పై కేసు నమోదైంది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణం బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఈనెల 8న హెడ్‌కానిస్టేబుల్‌ ప్రసాద్‌.. అదే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా హోంగార్డుతో అసభ్య ప్రవర్తించాడు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోలీసులు కేసు నమో...

December 13, 2024 / 05:49 AM IST

విషాదం.. స్కూల్‌పై నుంచి కిందపడ్డ విద్యార్థి

HYD: బోయిన్‌పల్లిలోని ఓ మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న తనీష్ రెడ్డి అనే విద్యార్థి పాఠశాల భవనం 2వ ఫ్లోర్ నుంచి గురువారం కింద పడిపోయాడు. ప్రమాదం జరిగినా విద్యార్థి తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం సమాచారం ఇవ్వలేదని బాధితులు వాపోయారు. గతంలోను ఈ పాఠశాల భవనంపై నుంచి ఓ విద్యార్థిని పడి మృతి చెందినట్లు సమాచారం.

December 13, 2024 / 05:10 AM IST

గొలుసు దొంగ అరెస్ట్.. బంగారం, బైక్ సీజ్

MDK: పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంద్రేశం గ్రామంలో ఇటీవల జరిగిన గొలుసు దొంగతనం కేసును పోలీసులు చేదించారు. ఈ కేసులో నారాయణఖేడ్ మండలం నిజాంపేట్‌కు చెందిన బుద్ధం దత్తు రాజ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతని నుండి మూడు తులాల బంగారం పుస్తెలతాడు, బైక్ స్వాధీనం చేసుకొని రిమాండ్ తరలించినట్లు పోలీసులు తెలిపారు.

December 13, 2024 / 04:00 AM IST

ఘోర అగ్ని ప్రమాదం.. ఆరుగురు మృతి

తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దిండిగల్‌ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఈ ప్రమాదం చోటుచేసుకోగా.. ఆరుగురు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. క్షతగాత్రులను మరో ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

December 13, 2024 / 12:55 AM IST

సూర్యాపేట సమీపంలో రోడ్డుప్రమాదం

SRPT: సూర్యాపేట మండలం టేకుమట్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాదు నుంచి విజయవాడ వెళుతున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టింది. కారులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. సూర్యాపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు.

December 12, 2024 / 08:56 PM IST

బంగారం వ్యాపారి ఇంట్లో 2.5 కిలోల బంగారం చోరీ

TG: HYDలోని దోమలగూడ పరిధి అరవింద్‌ కాలనీలో భారీ దోపిడీ జరిగింది. బంగారం వ్యాపారి ఇంట్లో నుంచి 2.5 కిలోల బంగారం చోరీ అయింది. వ్యాపారి రంజిత్‌, అతని సోదరుడి ఇళ్లలోకి 10 మంది దుండగులు చొరబడి కత్తులతో బెదిరించి లాకర్‌లోని 2.5 కిలోల బంగారం తీసుకెళ్లారు. మూడు ఫోన్లు, ఐట్యాబ్‌, సీసీటీవీ డీవీఆర్‌ ఎత్తుకెళ్లారు. కాగా.. దుండగుల దాడిలో వ్యాపారి రంజిత్‌కు గాయాలయ్యాయి.

December 12, 2024 / 08:50 PM IST

ఫోన్ ఇవ్వలేదని తల్లిపై కొడుకు కత్తితో దాడి

AP: ఫోన్ ఇవ్వలేదని తల్లిపై కొడుకు కత్తితో దాడి చేసిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో చోటు చేసుకుంది. మొబైల్ డేటా అయిపోయిందని తల్లిని ఫోన్ అడగగా.. ఇవ్వలేదని తల్లి నిద్రిస్తున్న సమయంలో కొడుకు కోపంతో కత్తితో గొంతుపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె గాయాలపాలైంది. ఆమెను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

December 12, 2024 / 07:50 PM IST

బాలికపై అత్యాచారం.. ఒకరిపై పోక్సో కేసు నమోదు

ATP: బాలికపై అత్యాచార ఘటనలో మడకశిర మండలం బేగార్లపల్లికి చెందిన రాజేశ్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు పెనుగొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు, అర్బన్‌ సీఐ రాగిరి రామయ్య తెలిపారు. మడకశిరలో గురువారం వారు విలేకరులతో మాట్లాడారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

December 12, 2024 / 07:33 PM IST

కానిస్టేబుల్‌ హత్య కేసులో మరో నిందితుడి అరెస్ట్

కానిస్టేబుల్‌ నాగమణి హత్య కేసులో మరో నిందితుడు అరెస్టయ్యాడు.  నిందితుడు శివను ఈ రోజు అరెస్టు చేసిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 2న మహిళా కానిస్టేబుల్‌ నాగమణిని తన తమ్ముడు పరమేశ్‌  హత్య చేసిన విషయం తెలిసిందే. పరమేశ్‌కు శివ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. కాగా.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలులో నాగమణి హత్యకు గురైంది.

December 12, 2024 / 06:57 PM IST

గ్యాస్ లీకై వివాహిత మృతి

విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీఐఐసీ కాలనీలో గురువారం ఇంట్లో గ్యాస్ లీక్ అవడంతో జరిగిన అగ్ని ప్రమాదంలో భార్గవి(27) తీవ్రంగా గాయపడింది. స్థానికులు కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మధ్యాహ్నం మహిళ మృతి చెందింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ పవన్ కిషోర్ తెలిపారు.

December 12, 2024 / 05:56 PM IST

కుక్కల దాడిలో 30 గొర్రె పిల్లలు, 2 పెద్ద గొర్రెల మృతి

NDL: మహానంది మండలం గాజులపల్లిలో కుక్కల దాడిలో 30 గొర్రె పిల్లలు, 2 పెద్ద గొర్రెలు గురువారం మృతిచెందాయి. గ్రామానికి చెందిన సాకలి రామకృష్ణ గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తున్నాడు. గొర్రె పిల్లల వద్ద ఎవరూ లేని సమయంలో వీధి కుక్కలు దాడి చేసి చంపాయని బాధితుడు వాపోయాడు. సుమారు రూ.లక్ష పైగా నష్టం వాటిల్లిందని తెలిపాడు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరాడు.

December 12, 2024 / 05:54 PM IST

రోడ్డు దాటుతున్న మహిళను ఢీ కొట్టిన డీసీఎం

WGL: రోడ్డు దాటుతున్న మహిళను డీసీఎం వాహనం ఢీ కొట్టడంతో ఓ మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన వర్ధన్నపేట పట్టణంలో జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. కొండేటీలక్ష్మి ఓ వేడుకకు హాజరై రోడ్డు దాటుతున్న క్రమంలో వరంగల్ నుంచి సూర్యాపేటకు వెళ్తున్న డీసీఎం వాహనం ఢీ కొట్టడంతో తీవ్రగాయాల పాలైన మహిళను ఆసుపత్రికి తరలించారు.

December 12, 2024 / 05:35 PM IST

కొండాపురంలో రైలు కిందపడి వ్యక్తి మృతి

KDP: గుంతకల్ రైల్వే జంక్షన్ పరిధిలో కొండాపురం మండలంలోని రేగడపల్లి స్టేషన్ సమీపంలో గురువారం సాయంకాలం రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఇతను రైలులో నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 12, 2024 / 05:16 PM IST

ప్రమాదవశాత్తు నదిలో మునిగి పంజాబ్ వాసి మృతి

KRNL: నదిలో స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి చెందాడు. పంజాబ్ రాష్ట్రం జలంధర్క చెందిన దుగ్గాల నరేశ్ (42) బుధవారం సాయంత్రం పంచలింగాల సమీపంలోని తుంగభద్ర నది తీరాన ఉన్న గంగమ్మ గుడి వద్ద స్నానం చేసేందుకు దిగాడు. ప్రమాదవశాత్తు పడిపోయి, ఈత రాకపోవడంతో మునిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు కర్నూలు తాలూకా ఎస్ఐ నరేశ్ తెలిపారు.

December 12, 2024 / 04:52 PM IST

రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

ATP: ధర్మవరం కళాజ్యోతి సర్కిల్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగమణి అనే మహిళ గాయపడి అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రం దొడ్డబల్లాపూర్‌కు చెందిన నాగమణి తన భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా ధర్మవరం కళాజ్యోతి సర్కిల్ వద్ద వెనక నుంచి వచ్చిన ఓ లారీ ఢీకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

December 12, 2024 / 04:34 PM IST