• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

రైలు ఢీకొని తల్లీకుమార్తె మృతి

AP: విజయవాడలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. శిరీష అనే మహిళ తన తల్లి వజ్రమ్మను ప్యాసింజర్ రైలు ఎక్కించేందుకు రైల్వేస్టేషన్‌కు వెళ్లింది. పట్టాలు దాటుతూ.. 3వ ప్లాట్‌ఫ్లాం వద్ద వజ్రమ్మకు సాయం చేయబోయింది. ఈ క్రమంలో వేగంగా వచ్చిన కోయంబత్తూర్ ఎక్స్‌ప్రెస్ రైలు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.

October 31, 2024 / 12:14 PM IST

గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య

KMR: సదాశివ నగర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులో గుర్తుతెలియని వ్యక్తిని గొడ్డలితో తలపైన నరికి దారుణంగా హత్య చేశారని ఎస్సై రంజిత్ కుమార్ తెలిపారు. ఈ వ్యక్తి ఫోటోను ఎవరైనా గుర్తు పడితే తమ సెల్ ఫోన్ నెంబర్లను సంప్రదించాలని చెప్పారు. ఎస్సై రంజిత్ కుమార్ సెల్ నెంబర్ :8712686164,8712686163 లను సంప్రదించాలని పేర్కొన్నారు. పథకం ప్రకారం హత్య చేసి ఉంటారన్నారు.

October 31, 2024 / 11:25 AM IST

SBIలో భారీ అగ్నిప్రమాదం

AP: విశాఖ SBI మెయిన్ బ్రాంచ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. SBI శాఖ నిర్వహిస్తున్న భవనం నుంచి పొగలు వచ్చాయి. దీపావళి కారణంగా సెలవు కావడంతో బ్యాంకు తెరవలేదు. లోపల నుంచి పొగలు రావడంతో స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది బ్యాంక్ డోర్లు పగలగొట్టి మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

October 31, 2024 / 11:08 AM IST

రైలు కిందపడి మహిళ ఆత్మహత్య

NDL: నంద్యాల రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని మహిళ గురువారం తెల్లవారుజామున రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మహిళ దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. వివరాలు తెలిస్తే 9441509497 నంబర్‌కు ఫోన్ చేసి తెలపాలని రైల్వే పోలీసులు కోరారు.

October 31, 2024 / 10:05 AM IST

మదనపల్లిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

అన్నమయ్య: అతిగా మద్యం తాగి మదనపల్లిలో వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది. సీఐ రామచంద్ర కథనం.. స్థానిక సీటీఎం రోడ్డులోని మీసేవ సమీపంలో రోడ్డు పక్కన అతిగా మద్యం తాగి ఓ వ్యక్తి క్కడే ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

October 31, 2024 / 09:33 AM IST

ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. ఒకరు మృతి

ALR: దీపావళి రోజు అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సీపట్నం నుంచి మద్దిగరువులో జరిగే వారపు సంత వెళ్తుండగా చింతపల్లి ఘాట్ రోడ్డు సమీపంలో బొలోరో.. ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడగా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

October 31, 2024 / 09:24 AM IST

బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగు

AP: తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సూర్యారావుపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగు పడింది. ఈ ఘటనలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

October 31, 2024 / 08:53 AM IST

షార్ట్ సర్కూట్‌తో ఇల్లు దగ్ధం

BHPL: భూపాలపల్లి మండలంలోని ఆజంనగర్‌లో షాట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన మహేశ్వరపు కొమురయ్య ఉదయం కాళేశ్వరం దైవదర్శనానికి ఇంటిల్లిపాది వెళ్లారు. సుమారు 2 గంటల ప్రాంతంలో షాట్ సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ.3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు స్థానికులు తెలిపారు.

October 31, 2024 / 08:05 AM IST

వరదల బీభత్సం.. 95కి చేరిన మృతులు

తూర్పు స్పెయిన్‌లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 95కి చేరినట్లు తెలుస్తోంది. అనేక మంది ఆచూకీ తెలియరాలేదు. అలాగే వరదల్లో వందల కార్లు కొట్టుకుపోయాయి. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

October 31, 2024 / 07:50 AM IST

2033 నాటికి ఏటా లక్ష సైబర్‌ దాడులు

దేశంలో డిజిటల్ వినియోగం పెరగడంతో సైబర్ దాడులు కూడా అత్యధికంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2033 నాటికి భారత్ ఏటా దాదాపు లక్ష సైబర్ దాడులను ఎదుర్కొంటుందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్య 2047 నాటికి 17 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని వెల్లడించారు. ఇటీవల ఎయిమ్స్, ప్రధాన విమానయాన సంస్థల నెట్‌వర్క్‌పై భారీగా సైబర్ దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.

October 31, 2024 / 03:50 AM IST

బ్రెయిన్ డెడ్‌తో బాలిక మృతి

MDK: తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురై బ్రెయిన్ డెడ్‌తో బాలిక మృతి చెందిన ఘటన నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ మేరకు గ్రామస్తులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చల్మెడ గ్రామానికి చెందిన బొమ్మని కనకరాజు లత దంపతుల కుమార్తె తనుశ్రీ( 7)రెండవ తరగతి చదువుతుంది. గురువారం నాడు సాయంత్రం తీవ్ర జ్వరంతో అస్వస్థకు లోనై ఫిట్స్ రావడంతో మరణించడం జరిగింది.

September 28, 2024 / 03:53 PM IST

సురక్షిత ప్రాంతానికి ఇరాన్ సుప్రీం లీడర్‌!

తాము జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో ఇరాన్ అప్రమత్తమైంది. భద్రత కారణాల దృష్ట్యా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. మరోవైపు.. నస్రల్లా హతం వార్తల వేళ తదుపరి కార్యాచరణ విషయంలో హెజ్‌బొల్లా, ఇతర సంస్థలతో ఇరాన్ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

September 28, 2024 / 03:42 PM IST

బాణసంచా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం

హర్యానాలోని బాణసంచా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోనిపట్ జిల్లాలోని రిదౌ గ్రామంలో ఓ ఇంట్లో అక్రమంగా నడుస్తున్న పటాకుల కర్మాగారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అనంతరం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

September 28, 2024 / 03:34 PM IST

వరదల బీభత్సం.. 39 మంది మృతి

నేపాల్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వరదల కారణంగా ఇప్పటివరకు 39 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా వివిధ నదుల నీటి మట్టాలు పెరుగుతాయని అక్కడి ప్రజలను అధికారులు హెచ్చరించారు. పశ్చిమాన ఉన్న నదులకు వరద పెరిగే అవకాశం ఉందని తెలిపారు. మరో 24 గంటలపాటు వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. మరికొన్ని కొన్ని గంటలపాటు భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉ...

September 28, 2024 / 03:24 PM IST

ఎల్లారెడ్డిపేటలో రోడ్డు ప్రమాదం

SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామ పంచాయతీ సఫాయి కార్మికుడు జల్లి బాలయ్య తన ద్విచక్రవాహనంపై రాంగ్ రూట్లో బస్టాండుకు వస్తున్నాడు. సింగారం గ్రామానికి చెందిన గొల్లపల్లి ఎల్లయ్య అనే వ్యక్తి తన బైకుపై గొల్లపల్లి వెళ్తుండగా బాలయ్య ఢీకొన్నాడు. బాలయ్యకు తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు.

September 28, 2024 / 03:14 PM IST