కృష్ణా: నందిగామ పట్టణ పరిధిలోని మునగచర్ల జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ బైక్ను ఓ కార్ ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.