PLD: నూజండ్లలోని హరిణి ఫర్టిలైజర్స్ షాపులో పురుగుమందుల విక్రయాలపై విజిలెన్స్ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో అనుమతులు లేకుండా ఎరువులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. షాపులో పురుగుమందులు, ఎరువులు ఇన్వాయిస్లను, రిజిస్టర్లు, లైసెన్సులను పరిశీలించగా సరైన అనుమతి పత్రాలు లేవని నిర్థారణకు వచ్చారు. దీంతో రూ.6.83 లక్షల సరుకును సీజ్ చేశారు.