WGL: ప్రభుత్వ నిషేధిత గుట్కాలను అక్రమంగా విక్రయిస్తున్న షాపుపై టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం దాడి చేశారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ కథనం మేరకు పరకాల పోలీస్ స్టేషన్ పరిధిలో రేపుల చంద్రశేఖర్ అనే వ్యాపారి అక్రమంగా గుట్కాలు విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చింది. పరకాల పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించి రూ.79,800 విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
కృష్ణా: కంచికచర్ల మండల పరిధిలోని పరిటాల జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
NLG: పుస్తెలతాడును తెంపుకెళ్ళిన ఘటన బుధవారం చిట్యాలలో చోటుచేసుకోగా పోలీసులు రంగంలోకి దిగి కొన్ని గంటల్లోనే దొంగను పట్టుకున్నారు. చిట్యాల ఎస్ఐ ధర్మ వివరాల ప్రకారం.. బుధవారం గుర్తుతెలియని ఇద్దరు దొంగలు ఉరుమడ్ల రోడ్డులో గల చేపూరి ప్రేమలత ఇంట్లోకి ప్రవేశించి, మెడలో ఉన్న ఐదు తులాల బంగారు పూసలతాడును తెంపుకొని పారిపోయారు.
WGL: వర్ధన్నపేట రైతుల వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ స్టాటర్, 50మీటర్ల కాపర్ వైర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు చోరి చేశారు. గురువారం శ్రీరాముల కొమరయ్య వ్యవసాయ పొలం వద్ద విద్యుత్ స్టాటర్ వైర్ చోరీకి గురైనట్లు రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 9వేలు నష్టం జరిగింది పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి చోరీకి పాల్పడిన దుండగులను పట్టుకుని శిక్షించాలని కోరారు.
ప్రకాశం: మద్దిపాడు మండలం వెల్లంపల్లి గ్రామ సమీపంలోని బంతిన వద్ద గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని గురువారం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యి అపస్మార్క స్థితిలోకి వెళ్లాడు. హైవే పోలీసులు గమనించి క్షతగాత్రులు ఒంగోలులోని రిమ్స్ వైద్యశాలకు తరలించారు.
SKLM: నందిగాం మండలం కవిటీ అగ్రహారం వద్ద గురువారం ఉదయం రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్సై ఎస్.కే షరీఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. పుచ్చకాయల ప్రతాప్ (20) వ్యక్తిగా గుర్తించినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
W.G: పెనుమంట్ర మండలం సోమరాజు ఇల్లింద్రపర్రులో గురువారం ఆటో బైక్ ఢీకొన్న ప్రమాదంలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన హరి(15) మృతి చెందాడు. మృతుడు కోత మెషీన్ పై పని నిమిత్తం ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్నేహితులు పెనుమంట్ర పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తణుకు తరలిస్తుండగా మృతి చెందాడు.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రం లోని బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రధాన రహదారిపై గుర్తుతెలియని యువకుడి శవాన్ని బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి పోలీసులు వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SDPT: జిన్నారం మండలం బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో క్వారీ గుంతలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. జీఎంఆర్ కాలనీకి చెందిన చిట్యాల రఘు, చిట్యాల రవి స్నానం చేయడానికి క్వారీకి వెళ్లారు. ప్రమాదవశాత్తు రవి నీటి గుంతలో పడి మునిగిపోయాడు. గజ ఈతగాల్లతో వెతకించినా ఆచూకీ లభించలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
VSP: అక్కయ్యపాలెంలో అంగన్వాడీ టీచర్ రహీమున్నీసాబేగంపై పెట్రోల్ దాడి ఘటనలో సంగీత అనే మహిళపై కేసు నమోదైంది. గోపాలపట్నంకి చెందిన సంగీత, రహిమున్నీసాబేగంకి రూ.35 వేలు అప్పుగా ఇచ్చింది. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడంతో బుధవారం పెట్రోల్ తీసుకుని అంగన్వాడీ కేంద్రానికి వచ్చి దాడి చేసిందన్నారు.
అకస్మాత్తుగా భూమి కుంగిపోవటంతో 13 మంది గల్లంతైన ఘటన చైనాలోని షెంజెన్ సిటీలో జరిగింది. రైల్వే నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నేలలోకి కూరుకుపోయిన కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు అక్కడి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఘటనాస్థలానికి సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ప్రకాశం: త్రిపురాంతకం మండలం టి.చెర్లోపల్లి గ్రామానికి చెందిన రైతు పుచ్చకాయల కేశయ్య (50) పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. మోటార్ ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కేశయ్య ఇంటికి రాకపోవడంతో పొలంకు వెళ్ళిచూడగా మృతిచెంది కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై శివబసవరాజు కేసు నమోదు చేశారు.
TG: పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్‌కు అల్లుఅర్జున్ రావడంతో ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి(39) అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్, కుమార్తె తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
KNL: బనగానపల్లె మండలంలోని యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో దైవదర్శనానికి వచ్చి బోయ సురేంద్ర యువకుడు ప్రమాదవశాత్తు కోనేరులో పడి మృతి చెందాడు. సురేంద్ర పెద్ద కోనేరులో దిగుతున్న క్రమంలో కాలు జారీ కోనేరులో పడి మృత్యువాత పడ్డాడు. మృతుని స్వగ్రామం గుంతకల్లు మండలం పాత చెరువు గ్రామంగా స్థానికులు గుర్తించారు.
NLG: ఇంట్లోకి జొరబడి ఒంటరిగా ఉన్న మహిళ మెడలో నుండి పుస్తెలతాడును లాక్కెళ్ళిన ఘటన బుధవారం చిట్యాలలో చోటుచేసుకుంది. చిట్యాల ఎస్సై ధర్మ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం సమయంలో గుర్తుతెలియని ఇద్దరు దొంగలు ఉరుమడ్ల రోడ్డులో గల చేపూరి ప్రేమలత ఇంట్లోకి ప్రవేశించి ఆమెను కొట్టి మెడలో ఉన్న ఐదు తులాల బంగారు పూసలతాడును లాక్కెళ్లారు.