ప్రకాశం: దర్శి నగర పంచాయతీలోని శివాజీ నగర్ సమీపంలో ఆదివారం సాయంత్రం ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో దర్శి ప్రభుత్వ హాస్పటల్కు తరలించారు. వీరందరూ శివాజీ నగర్‌కు చెందిన కూలీలుగా సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SRD: నారాయణఖేడ్-మంగళ్పేట శివారులో విద్యుత్ షాక్‌తో నాలుగు పాడి గేదెలు మృతి చెందాయి. ఈరోజు సాయంత్రం పశువులను మేపేందుకు గాండ్ల సతీష్, శివరాజ్ 20 గేదెలను తీసుకెళ్లారు. డిపో సమీపంలో వ్యవసాయ భూముల్లో మేస్తుండగా అక్కడ నీటి గుంతలో నీళ్లు తాగేందుకు వెళ్లి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం ఎర్తింగ్ వైర్ తాకాయి. నాలుగు గేదలు మృతి చెందాయి.
VKB: తాండూర్లో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని ఫ్లెఓవర్‌పై ద్విచక్ర వాహనం, కారు ఢీకొన్నాయి. బైక్ ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వారిని హుటాహుటిన తాండూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
E.G: మారేడుమిల్లి మండలం అమృతదార వద్ద కాలువలో పడి నలుగురు మెడికల్ విద్యార్థులు గల్లంతయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం.. ఏలూరులోని ఆశ్రమ్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న కొంతరు విద్యార్థులు ఆదివారం పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు మారేడుమిల్లికి వచ్చారు. వీరిలో నలుగురు పొంగి ప్రవహిస్తున్న వాగులో గల్లంతవగా స్థానికులు గాలిస్తున్నారు.
NLG: కేతెపల్లి మండలం భీమారం శివారులోని మూసీ వాగులో 8 మంది ఆదివారం చిక్కుకున్నారు. ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో ఎనిమిది మంది చిక్కుకున్నారు. దీంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించడంతో సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్న బాధితులను కాపాడేందుకు అధికారులు, స్థానికులు రంగంలోకి దిగారు.
AKP: చోడవరం నడిబొడ్డున ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో శనివారం చోరీ జరిగింది. పట్టపగలే బాబా వెండి కిరీటంతో పాటు సింహం బొమ్మకు అలంకరించిన వెండి తాపడంలోని కొతభాగాన్ని దొంగలు పట్టుకుపోయారు. ప్రేమ సమాజానికి ఆనుకుని ఉన్న ఈ ఆలయంలో సుమారు రూ.లక్ష విలువ చేసే వెండి ఆభరణాలు చోరీకి గురి కావడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు.
BHNG: గేదె చెరువులోకి లాక్కెళ్లడంతో రైతు మృతి చెందిన ఘటన మోత్కూర్ మండలం పాటిమట్టలలో ఆదివారం జరిగింది. గ్రామస్థుల వివరాల మేరకు.. నాగపూర్ నరసయ్య (70) అనే రైతు గేదెను మేతకు తీసుకెళ్లాడు. గేదె మెడకు ఉన్న పగ్గాన్ని(తాడు) చేతికి కట్టుకున్నాడు. ఒక్కసారిగా చెరువులోకి లాక్కెళ్లడంతో చనిపోయాడు. నరసయ్య మృతితో గ్రామంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.
PLD: కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గురజాల మండలం పులిపాడు గ్రామానికి చెందిన గంగరాజు(30) కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ASR: అరకులోయ మండలంలోని సుంకర మెట్ట పరిధిలోని గాలి కొండ వ్యూ పాయింట్ సమీపంలో మలుపు వద్ద ఆదివారం 108 అంబులెన్స్‌కి ప్రమాదం జరిగింది. 108 డ్రైవర్ లోడ్ తో వెళ్తున్న బెంజ్ లారిని తప్పించబోయి మలుపు వద్ద బండరాయిని ఢీకొట్టడంతో అంబులెన్స్ ముందు భాగం పాక్షికంగా దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. ఎవ్వరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు.
NLR: నాయుడుపేటలో బస్టాండ్ ప్రాంతం వద్ద ఉన్న నకల జాతుల దుకాణాలు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. అగ్ని ప్రమాదంలో రెండు షాపులు పూర్తి కాలిపోయాయి. గతంలో వ్యాపారం చేసుకుంటున్న స్థలాన్ని కోర్టు ఉత్తర్వులతో నకలజాతుల వారిని తొలగించారు. అప్పటి నుంచి డివైడర్ పై షాపులు పెట్టుకుని, అక్కడే జీవనం సాగిస్తున్నారు. అగంతుకులు నిప్పుపెట్టడంతో రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ATP: పామిడి మండలం రామగిరి దిగువ తండా గ్రామంలో ఆదివారం పోలీసులు మెరుపు దాడులు చేశారు. సీఐ యుగంధర్ మాట్లాడుతూ… నాటు సారా తయారు చేస్తున్నారని తమకు రాబడిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు నిర్వహించామన్నారు. అందులో భాగంగా 800 లీటర్ల నాటు సారా బెల్లపు ఊటను ధ్వంసం చేశామన్నారు.
శ్రీకాకుళం: రోడ్డులో అంతకాపల్లి గ్రామ సమీపంలో ఓ మామిడి తోటలో మరడాన శివ (25) అనే యువకుడు ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఉద్దవోలు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రకాశం: మండలంలోని వల్లూరమ్మ దేవస్థాన సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఆదివారం ఒంగోలు విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వడ్లపూడి గ్రామం, గుంటూరు జిల్లా నుంచి తమిళనాడు రాష్ట్రం మధురైకు అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసే దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు.
ఇరాన్‌లోని బొగ్గు గనిలో గత రాత్రి భారీ పేలుడు సంభవించింది. టెహ్రాన్‌కు సమీపంలోని తబాసలోని బొగ్గు గనిలో మిథేన్ గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 30 మంది చనిపోగా.. 24 మంది శిథిలాల మధ్యలో చిక్కుకున్నారు. ఈ ప్రమాద సమయంలో 69 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన నుంచి 28 మంది సురక్షితంగా బయటపడ్డారు. దీనిపై స్పందించిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్.. బాధితులకు అవసరమైన సాయం తక్షణమే అ...
MNCL: మంచిర్యాల- రవీంద్రఖని రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం తెల్లవారుజామున రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుని వయసు 40 నుంచి 45 సంవత్సరాలు ఉండగా, మల్టీ కలర్ పూల షర్టు, ఛాతీపై ఒక పుట్టుమచ్చ ఉంది. జీఆర్పీ ఎస్సై ఎ. మహేందర్ ఉత్తర్వుల మేరకు హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.