• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

BREAKING: 5.3 తీవ్రతతో భూకంపం

TG: రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్‌, నల్గొండ, మంచిర్యాల జిల్లాల పరిధిలో భూప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్‌లోని వనస్థలిపురం, హయత్‌నగర్‌తో పాటు అబ్దుల్లాపూర్‌మెట్‌లో భూమి కంపించింది. మణుగూరు, భద్రాచలం, చర్ల, చింతకాని, నాగులవంచ మండలాల్లో భూమి కంపించింది. కొత్తగూడెంలో ఉదయం 7:27 గంటలకు 3 సెకన్ల పాటు, ములుగులో అత్యధికంగా రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో ప్రకంపనల...

December 4, 2024 / 08:07 AM IST

గుండెపోటుతో విద్యార్థి మృతి

MBNR: చిన్నచింతకుంట మండలం, ఉంద్యాల, గ్రామానికి చెందిన మధు(18)గుండెపోటుతో మంగళవారం ఆకస్మికంగా మృతి చెందారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..గత రెండు రోజుల నుంచి చాతిలో నొప్పి వస్తుందని తెలిపాడు. అయితే ఈసీజీ నిమిత్తం ఆత్మకూరుకు తీసుకురాగా అంతలోనే మృత్యువాత పడినట్లు తెలిపారు. మధు గద్వాల పట్టణంలో ఐటీఐ చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

December 4, 2024 / 07:49 AM IST

BIG BREAKING: తెలుగు రాష్ట్రాల్లో భూకంపం

తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. విజయవాడలో పలు సెకన్ల పాటు భూమి కంపించింది. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో భూమి కంపించింది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ జిల్లాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయంతో ప్రజలు ఇళ్లలో నుంచి పరుగులు తీశారు.

December 4, 2024 / 07:40 AM IST

రోడ్డు ప్రమాదం.. 8మందికి గాయాలు

MBNR: బాలానగర్ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి తహశీల్దార్ కార్యాలయం ముందు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రైల్వే బ్రిడ్జి నుంచి మండల కేంద్రానికి వస్తున్న ఆటో.. మండల కేంద్రం నుంచి రైల్వే బ్రిడ్జి వైపు వెళ్తున్న ఐస్ క్రీమ్ వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి.

December 4, 2024 / 07:31 AM IST

లారీ – బస్సు ఢీకొని ఒకరు మృతి

అన్నమయ్య: రాజంపేట పట్టణ శివారుల్లోని భువనగిరిపల్లె అర్చి వద్ద బుధవారం తెల్లవారుజామున లారీ – ట్రావెల్స్ బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

December 4, 2024 / 07:24 AM IST

ప్రేమ పేరుతో మోసం.. యువతి ఆత్మహత్య

MNCL: ప్రేమ పేరుతో వంచించడంతో యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన బెల్లంపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. హనుమాన్ బస్తీకి చెందిన సాయి స్నేహిత, శ్రీనాథ్‌లు కొంతకాలంగా ప్రేమించుకున్నారు. కాగా పెళ్లికి శ్రీనాథ్ నిరాకరించడంతో మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

December 4, 2024 / 06:06 AM IST

గూగుల్ మ్యాప్ నిర్వాకం.. కెనాల్‌లోకి కారు

గూగుల్ మ్యాప్ ఫాలో అవుతూ కారు నడుపుకుంటూ వెళ్లిన వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. గూగుల్ సందేశాలను అనుసరిస్తూ వెళ్లిన కారు కెనాల్‌లో పడిపోయింది. ఈ సంఘటన యూపీలోని రాయ్‌బరేలీ- పిలిభిత్ రహదారిపై జరిగింది. కాగా కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎలాంటి హాని జరగలేదు. సమాచారం తెలుసుకున్న అధికారులు ఓ క్రేన్‌ను తీసుకువచ్చి కాలువలో పడిపోయిన కారును బయటకి తీశారు.

December 4, 2024 / 06:06 AM IST

మొగ్దూంపూర్లో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

KNR: మొగ్దుంపూర్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై ఇద్దరు వ్యక్తులు కరీంనగర్ వైపు వెళ్తుండగా.. ఓ లారీ అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంది. దీంతో వారు లారీని వెనుకనుంచి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో చెన్నూర్‌కు చెందిన సాగర్ మృతిచెందారు. దండేపల్లి మండలం కన్నేపల్లికి చెందిన శ్రీనుకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని 108కి సమాచారమిచ్చి ఆసుపత్రికి తరలించారు.

December 4, 2024 / 04:36 AM IST

చిరుతను ఢీకొట్టిన వాహనం

TG: కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండలంలో ప్రమాదం చోటుచేసుకుంది. 44వ జాతీయ రహదారిపై ఓ వాహనం చిరుతను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిరుతకు స్వల్ప గాయాలు కావడంతో చాలా సేపు రోడ్డుపైనే ఉంది. దీంతో చిరుతను చూసిన వాహనదారులు భయాందోళనకు గురైయ్యారు. దాదాపు రెండు గంటల పాటు రోడ్డుపైనే పడుకున్న చిరుత.. అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు గాలింపు చేపట్టారు.

December 3, 2024 / 10:58 PM IST

విద్యుత్ ఘాతంతో వివాహిత మృతి

SRPT: కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండలో మంగళవారం విద్యుత్ ఘాతానికి గురై వివాహిత మహిళ మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన మహమ్మద్ భార్య షేక్ నసీమా వాటర్ హీటర్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

December 3, 2024 / 08:39 PM IST

బైకు ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి

CTR: ఏర్పేడు-వెంకటగిరి రోడ్డుపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పల్లంపేట నుంచి బైక్‌పై వస్తున్న వ్యక్తిని పల్లాం దగ్గర తిరుపతి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

December 3, 2024 / 08:36 PM IST

మధిరలో రన్నింగ్ ట్రైన్ నుండి మున్నేటిలో జారిపడ్డ వ్యక్తి

KMM: మధిర పట్టణంలోని మున్నేటి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నుండి మంగళవారం మధ్యాహ్నం విజయవాడ నుండి సికింద్రాబాద్ వెళ్తున్న కృష్ణ ఎక్స్ప్రెస్ రన్నింగ్ రైలు నుండి జారిపడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సాయి చరణ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి దీంతో స్థానికులు గమనించి ఆ వ్యక్తిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

December 3, 2024 / 08:24 PM IST

రోడ్డు ప్రమాదం.. చిరుతకు గాయం

KMR: సదాశివనగర్ మండలం దగ్గి – చంద్రాయనపల్లి గ్రామాల మధ్యలో ఉన్న అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి జాతీయ రహదారి 44 పై చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిరుతకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో రోడ్డు మీదనే పడి ఉండడంతో వాహనదారులు జాతీయ రహదారిపై ప్రయాణించడానికి జంకుతున్నారు.

December 3, 2024 / 08:19 PM IST

నూజివీడు పట్టణంలో వరుస దొంగతనాలు

కృష్ణా: నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. నవంబర్ 24వ తేదీన పట్టణంలోని ఎస్ఐసీ వద్ద మహిళ నుంచి 7 తులాల బంగారు గొలుసు చోరీకి విఫలయత్నం జరిగింది. అదేరోజు చర్చికి వెళుతున్న మహిళ నుంచి 3 కాసుల బంగారు గొలుసు చోరీ జరిగింది. 27వ తేదీ విద్యుత్ ఏడీఈ దుర్గారావు గృహంలో 25 కాసులు చోరీలతో ప్రజలు భయ బ్రాంతులవుతున్నారు.

December 3, 2024 / 06:47 PM IST

గుడివాడలో దారుణం భర్తను చంపిన భార్య

కృష్ణా: గుడివాడలో దారుణం చోటుచేసుకుంది. 22 వార్డులో నివసిస్తున్న చిన్నా అనే వ్యక్తిపై అతని భార్యజ్యోతి కత్తితో దాడి చేయడంతో చిన్న మృతి చెందాడు. వీరికి పిల్లలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. భర్తను చంపి ఓ కుమారుడుని తీసుకొని భార్య పరార్ అయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గుడివాడ పోలీసులు వెల్లడించారు.

December 3, 2024 / 06:23 PM IST