• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

బంగ్లాలో చిన్మోయ్ లాయర్‌పై ఇస్లామిస్టుల దాడి

బంగ్లాదేశ్‌లో అరెస్టయిన హిందూ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్ తరపున వాదిస్తున్న న్యాయవాది రామన్ రాయ్‌పై తాజాగా ఇస్లామిస్టులు దాడికి పాల్పడ్డారు. ‘ఇస్లామిస్టులు అతని ఇంటిపై క్రూరంగా దాడి చేశారు. ప్రస్తుతం అతడు ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. చిన్మోయ్ తరపున మాట్లాడటమే అతను చేసిన అతి పెద్ద తప్పు’ అని ఇస్కాన్ కోల్‌కతా అధికార ప్రతినిధి రాధారమన్ దాస్ ఎక్స్ వేదికగా తెలిపారు.

December 3, 2024 / 10:41 AM IST

బైక్‌ను ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి

W.G: పెనుమంట్ర మండలం మార్టేరులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మార్టేరు నుంచి పెనుగొండ వెళ్లే రోడ్డులో బైక్ పై వెళుతున్న ఇద్దరు యువకులను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందగా.. గాయాలైన వ్యక్తిని చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

December 3, 2024 / 10:36 AM IST

చెట్టును ఢీకొన్న కారు.. యువకుడు మృతి

అన్నమయ్య: వాల్మీకిపురంలోని టీఎంలోయ వద్ద మంగళవారం వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు చెట్టును ఢీకొని యువకుడు దుర్మరణం చెందినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. కలికిరికి పట్టణం, శివాలయం వీధిలో ఉండే అబ్దుల్ల కొడుకు అశ్రఫ్ (27) మదనపల్లె నుంచి కలికిరికి వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. 

December 3, 2024 / 10:28 AM IST

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అక్కా, తమ్ముడు

WNP: రోడ్డు ప్రమాదంలో వనపర్తి జిల్లాకు చెందిన అక్కాతమ్ముడు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొత్తకోట మండలం కానాయపల్లికి చెందిన మనోజ్(25), అక్క పద్మ(31) ఆమె కుటుంబంతో కుంట్లూర్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో కోహెడ-పెద్దఅంబర్‌పేట ఔటర్‌రింగ్‌ రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని.. వీరి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో మనోజ్, పద్మ మృతిచెందారు. మృతుల తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస...

December 3, 2024 / 10:28 AM IST

చెన్నేరి వద్ద రోడ్డు ప్రమాదం

CTR: సత్యవేడు మండలం చెన్నేరి గ్రామం వద్ద ఎదురెదురుగా బైకులు ఢీకొనడంతో వాహనదారులు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. చెన్నేరి మాదిగవాడకు చెందిన శ్రీనివాసులు తమిళనాడు ఊతుకోట నుంచి ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో పుదుకుప్పం గ్రామానికి చెందిన భార్గవ్ కూడా తలకు గాయమైనట్టు సమాచారం.

December 3, 2024 / 10:08 AM IST

పామిడిలో కరెంటు షాక్‌తో యువకుడి దుర్మరణం

ATP: పామిడి పట్టణం బ్రాహ్మణ వీధికి చెందిన వెంకటేశ్ అనే యువకుడు నిన్న రాత్రి కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. పట్టణంలోని సంతమార్కెట్ వీధిలో ఓ రేకుల షెడ్డు కింద స్నేహితులతో కూర్చొని మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు.

December 3, 2024 / 09:56 AM IST

జిల్లాలో ఇష్టారాజ్యంగా అక్రమ ఇసుక రవాణా

BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాక పంచాయతీ పరిధిలో గల గాంధీ నగర్ నుండి అక్రమ ఇసుక రవాణా విచ్చలవిడిగా చేస్తున్నారని మంగళవారం స్థానికులు అగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంతో వాహనాలను నడుపుతున్నారని.. దీని వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. రెవెన్యూ శాఖ అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

December 3, 2024 / 09:52 AM IST

బస్సు, కారు ఢీ.. ఐదుగురు MBBS విద్యార్థులు మృతి

కేరళలో బస్సును కారు ఢీకొనడంతో ఐదుగురు MBBS విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం రాత్రి 9 గం.లకు కారులో ఏడుగురు విద్యార్థులు అతి వేగంతో వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను మహమ్మద్, ముహాసిన్, ఇబ్రహీం, దేవానంద్, శ్రీదీప్‌లుగా అధికారులు గుర్తించారు. ఐదుగురు విద్యార్థుల్లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మరణించినట్లు అధికార...

December 3, 2024 / 08:53 AM IST

ట్రాక్టర్ ఢీకొని తండ్రి, కుమార్తెకు తీవ్ర గాయాలు

అన్నమయ్య: ట్రాక్టర్ ఢీకొని తండ్రి, కుమార్తె తీవ్రంగా గాయపడినట్లు గుర్రంకొండ ఎస్సై మధు రామచంద్రుడు తెలిపారు. గుర్రంకొండ పట్టణంలో ఉండే షేక్ రిజ్వాన్(47), అదే ఊరిలోని ఇందిరమ్మ కాలనీలో కాపురం ఉంటున్న తన అన్న కుమార్తె పైజుల 9నెలల గర్భవతి కావడంతో ఆమెను తన అన్న ఇంటికి తీసుకురావడానికి వెళ్లాడు. సోమవారం రాత్రి అన్న కూతుర్ని తీసుకొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

December 3, 2024 / 08:33 AM IST

తల్లి మందలించిందని కొడుకు ఆత్మహత్య

ELR: కైకలూరుకి చెందిన నాదెళ్ల వెంకటేశ్(28) తల్లితో కలిసి ఇండియన్ బ్యాంకు సమీపంలో నివసిస్తున్నారు. మద్యానికి బానిసైన వెంకటేష్ తరచూ తాగి ఇంటికి వస్తుండటంతో తల్లి తాగొద్దని మందలిస్తూ ఉండేది. సోమవారం కూడా తాగి రావడంతో తల్లి అసహనం వ్యక్తం చేసింది. దీంతో వెంకటేశ్ ఇంట్లో ప్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్మ చేసుకున్నాడు.

December 3, 2024 / 07:44 AM IST

గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

SRCL : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఓ వ్యక్తి గంజాయి అమ్ముతూ పట్టుబడ్డాడు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించామని ఎస్సై రమాకాంత్ తెలిపారు. రాచర్ల బొప్పాపూర్ ఎల్లమ్మ ఆలయం వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని తనిఖీ చేయగా 80 గ్రాముల గంజాయి లభించిందన్నారు.

December 3, 2024 / 07:43 AM IST

నగ్న వీడియోలతో బెదిరించి అఘాయిత్యం

AP: నగ్నవీడియోలతో బెదిరించి రెండేళ్లుగా అత్యారం చేస్తూ, హింసలకు గురి చేస్తున్నాడంటూ ఓ వివాహిత నిన్న గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. గుంటూరు నల్లపాడు రోడ్డులో తినుబండారాల వ్యాపారం చేస్తున్న మహిళ ఫోన్ నెంబర్ తీసుకున్న వైసీపీ నాయకుడు నాగేశ్వరరావు పరిచయం పెంచుకున్నాడు. తరువాత తనపై అత్యాచారం చేసి చిత్రీకరించాడు. వాటిని అడ్డుపెట్టుకొని తరచూ అత్యాచారం చేస్తున్నాడని, తనకు న్యాయం చేయా...

December 3, 2024 / 07:11 AM IST

SI అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు.. తరువాత..!

AP: ఎస్సై అని చెప్పి ఓ వివాహితను మోసం చేసిన ఘటన గుంటూరులో జరిగింది. పెళ్లై ఇద్దరు ఆడ పిల్లలు ఉన్న మహిళ మనస్పర్థల కారణంతో తన భర్తతో విడిపోయింది. అనంతరం కొత్తపేటలోని ఓ ఆసుపత్రిలో రిసెప్షనిస్టుగా పని చేస్తోంది. ఈ క్రమంలో సాయితేజ అనే వ్యక్తి  పరిచయమయ్యాడు. తాను ఎస్సైనని నమ్మించి 2023లో పెళ్లి చేసుకున్నాడు. తరువాత విడతలవారిగా తన నుంచి రూ. 23 లక్షలు, 8 సవర్ల బంగారం తీసుకొని పరార్ అయినట్లు ఫిర్యా...

December 3, 2024 / 06:48 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్ డెడ్

ప్రకాశం: వేటపాలెం మండలం పొట్టి సుబ్బయ్యపాలెం వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వేటపాలెంకు చెందిన కళ్యాణ్ రామ్, కంచర్ల వెంకట మనోజ్‌లు బైక్‌పై సముద్రతీరం నుంచి తిరిగి వస్తుండగా రోడ్డుపై ఉన్న సిమెంట్ గ్రావెల్‌ను ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో కళ్యాణ్ రామ్ అక్కడికక్కడే మృతి చెందగా.. మనోజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

December 3, 2024 / 05:55 AM IST

పెళ్ళైన 4 నెలలకే వివాహిత ఆత్మహత్య

MNCL: మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెళ్ళైన 4 నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. స్థానిక ఏసీసీ కృష్ణ కాలనీకి చెందిన అయిండ్ల రోషిణి కడుపు నొప్పి భరించలేక సోమవారం రాత్రి తల్లిగారింటి వద్ద మూడో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి గత ఆగస్టులో వివాహం జరిగింది. కేసు నమోదు చేసినట్లు SI రాములు తెలిపారు.

December 3, 2024 / 05:21 AM IST