• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి మృతి

కోనసీమ: ప్రమాదవశాత్తు ఒక వ్యక్తి మృతిచెందిన ఘటన ఆలమూరు స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై ఎం.అశోక్ తెలిపిన వివరాలు ప్రకారం.. మూలస్థానం అగ్రహారం గ్రామానికి చెందిన కుడిపూడి రుద్రయ్య (30) అనే వ్యక్తి సోమవారం మధ్యాహ్నం సమయంలో బహిర్భూమికి వెళ్లే తరుణంలో పిట్స్ రావడంతో ప్రమాదవశాత్తు ప్రక్కనే ఉన్న పంట కాలువలో పడి మృతిచెందారన్నారు.

September 23, 2024 / 08:08 PM IST

‘పిడుగుపాటుకు 11 మేకలు మృత్యువాత’

ప్రకాశం: మర్రిపూడి మండలంలోని అంకేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో సన్నమూరు గ్రామంలో సోమవారం కురిసిన వర్షానికి పిడుగు పడి 11 మేకలు మృతి చెందగా మరో మూడు మేకలు కళ్ళు పోయాయని బాధితుడు వాడపల్లి మీరావలి తెలిపారు. ఉరుములు మెరుపులు సమయములో తాను ఒకపక్క చెట్టు కింద మేకలు ఉండడంతో పిడుగు పడి మేకలు అక్కడకక్కడే మృతి చెందాయని తాను ప్రాణాపాయం నుండి బయటపడినట్లు తెలిపారు.

September 23, 2024 / 08:06 PM IST

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

తూ.గో: తుని మండలం ఎర్రకోనేరు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృత్యువాత పడింది. కాగా ఆ మహిళ భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తుని రూరల్ పోలీసులు మీడియాకు తెలియజేశారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

September 23, 2024 / 06:51 PM IST

రావులవారిగూడెం వద్ద రోడ్డు ప్రమాదం

NLG:  వేములపల్లి మండలం రావులవారిగూడెం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సూర్యాపేట భీమారం రహదారిపై రావులవారిగూడెం వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణించిన వారికి స్వల్ప గాయాలు అయ్యాయి.

September 23, 2024 / 06:22 PM IST

హెజ్‌బొల్లాలో భీకర దాడులు.. 100 మంది మృతి!

లెబనాన్‌లోని హెజ్‌బెల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇవాళ ఒక్కరోజే 300 లక్ష్యాలపై దాడులు జరిగాయి. ఇజ్రాయెల్ వైమానికి దాడుల్లో దాదాపు 100 మంది మృతి చెందినట్లు లెబనాన్ అధికారులు వెల్లడించారు. గత ఏడాది అక్టోబరు నుంచి ఇవే అతిపెద్ద దాడులుగా సమాచారం.

September 23, 2024 / 05:36 PM IST

మహిళా ఎస్సై తలలోకి దూసుకెళ్లిన బాణం

పోలీసులపై దుండగులు దాడి చేసిన ఘటన బిహార్‌లో జరిగింది. అరారియా జిల్లాలోని  ఓ భూవివాదం కేసులో పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. ఈ క్రమంలో దుండగులు బాణాలతో పోలీసులపై దాడికి దిగారు. దీంతో ఆ బాణం ఓ మహిళా ఎస్సై తలలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అధికారిణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

September 23, 2024 / 05:21 PM IST

పిడుగుపడి ఎనిమిది మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాజ్‌నంద్‌గావ్ జిల్లాలోని జోరటరాయ్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పిడుగుపడి నలుగురు చిన్నారులతో సహా ఎనిమిది మంది మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ స్పందించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపరిహారం అందించాలని కోరారు.

September 23, 2024 / 05:16 PM IST

యూపీలో ఘరానా మోసం.. రూ.కోట్లు టోకరా

యూపీలోని కాన్పూర్‌లో ఇజ్రాయెల్ యంత్రంతో ఆక్సిజన్ థెరఫీ చేసి 60 ఏళ్ల వృద్ధులను 25 ఏళ్ల యువకులుగా మారుస్తామని రాజీవ్ దూబే, రష్మీ దూబే ప్రజలను నమ్మించారు. సాకేత్ నగర్‌లో రివైవల్ వరల్డ్ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. కొంతమందికి థెరపీ కూడా చేశారు. కానీ, చికిత్స కారణంగా ఎవరూ లాభపడకపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ థెరపీ కోసం ప్రజల నుంచి రూ.35 కోట్ల వరకు వసూలు చేసినట్...

September 23, 2024 / 05:11 PM IST

రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

NZB: బోధన్ సాలుర మండల హన్సా గ్రామానికి చెందిన సంజు పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై బోధన్ వెళుతుండగా సోమవారం ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి NH 63కి అనుసంధాన అంతర్ రాష్ట్ర ప్రధాన రహదారిలో సాలూర వద్ద మహారాష్ట్ర నుంచి బోధన్ వైపు వెళ్తున్న స్కార్పియో వాహనం ద్విచక్ర వాహనాన్ని వేగంగా వచ్చి వెనుక నుండి ఢీకొనడంతో సంజూ అక్కడికక్కడే మృతి చెందారు.

September 23, 2024 / 04:56 PM IST

తేనెటీగల దాడికి నలుగురు మృతి

రాంచీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తేనెటీగల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మృతిచెందిన వారిలో ఓ మహిళ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇంటికి సమీపంలోని ఓ బావిలో స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని మహిళ భర్త సునిల్ బార్లా తెలిపాడు. ఆ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులపై కూడా తేనెటీగలు దాడి చేశాయని, వారు వెంటనే అప్రమత్తమై సురక్షితంగా బయటపడ్డారని పేర్కొన్నాడు.

September 23, 2024 / 04:36 PM IST

ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భారీ మోసం

AP: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 10 మంది వద్ద దాదాపు రూ.కోటి వసూలు చేసిన మోసానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. చిలకలూరిపేటకు చెందిన గుంజి శ్రీనివాసరావు అనే వ్యక్తి రైల్వే, జిల్లా కోర్టులలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేశాడని బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫేక్ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు చూపి, దొంగ అధికారులతో విచారణ పేరుతో మోసం చేసినట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు న్...

September 23, 2024 / 04:25 PM IST

బొగ్గు గని పేలుడు.. 38 మంది మృతి

ఇరాన్ తబాస్‌లోని బొగ్గు గనిలో పేలుడు సంభవించింది. ఇందులో ఇప్పటి వరకు 38 మంది మరణించగా.. 14 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. మీథేన్ వాయువు అకస్మాత్తుగా లీక్ కావడం వల్ల పేలుడు జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే, మృత‌దేహాల‌పై ఎలాంటి బ్లాస్ట్ గాయాలు లేవ‌ని, వాళ్లు పేలుడుకు ముందే వాయువు వ‌ల్ల ప్రాణాలు కోల్పోయి ఉంటార‌ని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

September 23, 2024 / 04:03 PM IST

ఘోర ప్రమాదం.. దంపతుల మృతి

ATP: అనంతపురం నగరం నేషనల్ పార్కు సమీపంలో సోమవారం టమాటా లోడ్‌తో వెళ్తున్న ఐచర్ వాహనం అదుపుతప్పి ద్విచక్ర వాహనంపై పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గుత్తి మండలం అబ్బే దొడ్డి గ్రామానికి చెందిన దంపతులు హనుమంత రెడ్డి, రంగమ్మగా పోలీసులు గుర్తించారు. వారు అనంతపురంలో ఉంటున్న తమ కుమార్తెలను చూసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

September 23, 2024 / 02:48 PM IST

లారీ బోల్తా.. ఇద్దరు వ్యక్తుల మృతి

ATP: అనంతపురంలోని నేషనల్ పార్క్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టమాటా లోడు లారీ బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

September 23, 2024 / 01:51 PM IST

బస్సు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

HYD: బస్సు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్‌లో చోటుచేసుకుంది. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలు ప్యాట్నీ నుంచి ప్యారడైజ్ వైపు వెళ్తున్న RTC బస్సు వెనక చక్రాల కింద పడి గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి 35 నుంచి 40 ఏళ్లు ఉంటాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

September 23, 2024 / 01:50 PM IST