• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

మహిళా కానిస్టేబుల్ పరువుహత్య

TG: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలంలో పరువుహత్య సంచలనం సృష్టించింది. హయత్ నగర్‌ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నాగమణి పది నెలల క్రితం భర్తకు విడాకులు ఇచ్చి నెల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. ఇది చూసి తట్టుకోలేకపోయిన తన తమ్ముడు నాగమణి విధులకు వెళ్తుండగా కారుతో ఢీకొట్టి కత్తితో డాడి చేసి హతమార్చాడు.

December 2, 2024 / 10:41 AM IST

మహిళా కానిస్టేబుల్ పరువు హత్య

TG: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలంలో పరువు హత్య సంచలనం సృష్టించింది. హయత్ నగర్‌ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న నాగమణి పది నెలల క్రితం భర్తకు విడాకులు ఇచ్చి నెల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. ఇది చూసి తట్టుకోలేకపోయిన తన తమ్ముడు నాగమణి విధులకు వెళ్తుండగా కారుతో ఢీకొట్టి కత్తితో డాడి చేసి హతమార్చాడు.

December 2, 2024 / 10:41 AM IST

మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య

RR: ఇబ్రహీంపట్నం పరిధి రాయపోల్-ఏన్లగూడ రోడ్లో మహిళా కానిస్టేబుల్ హత్య కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణి నెలరోజుల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కాగా, ఈరోజు ఉదయం డ్యూటీకి స్కూటీపై వెళ్తుండగా ఆమె తమ్ముడు కారుతో ఢీకొట్టాడు. కిందపడిన ఆమెను కత్తితో మెడపై నరికి హత్య చేశాడు.

December 2, 2024 / 10:26 AM IST

సెలబ్రిటీలను మోసం చేసిన విశాఖ యువకుడు

VSP: సెలబ్రిటీలను మోసం చేసిన కేసులో విశాఖకు చెందిన తొనంగి కాంతిదత్ (24)ను చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు. 10th ఫెయిలైన అతను ఈవెంట్స్ సంస్థను నెలకొల్పి సెలబ్రెటీలతో పరిచయాలు పెంచుకున్నాడు. అనంతరం తన వ్యాపారాల్లో సెలబ్రెటీలు పెట్టుబడులు పెడుతున్నారని నమ్మించి పలువురి వద్ద కోట్ల రూపాయలు వసూలు చేశాడు.

December 2, 2024 / 09:54 AM IST

బోలేరో వాహనం, బైకు ఢీకొని బాలుడి మృతి

WGL: జిల్లా నెక్కొండ మండలంలోని రామన్న కుంట తండ గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో రామన్నకుంట తండా గ్రామానికి చెందిన గుగులోతు భాస్కర్ కుమారుడు విక్కీ (6)కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

December 2, 2024 / 09:52 AM IST

యాక్సిడెంట్.. మృతుడు మహబూబ్‌నగర్ వాసి

NRPT: కృష్ణ మండలంలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉదయం ఒకరు మృతిచెందారు. మృతుడు MBNR జిల్లా హన్వాడ మం. టంకరకు చెందిన కఠికే సురేష్‌గా గుర్తించారు. సురేశ్ చికెన్ సెంటర్ వ్యాపారి. బస్సులో ఫుట్ బోర్డు వద్ద నిలబడి ఉండగా లారీ ఢీకొట్టడంతో ఎగిరి కిందపడి చనిపోయారు. యాదగిరిగుట్ట డిపో బస్సు రాయచూర్ నుంచి HYDకి వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది.

December 2, 2024 / 09:45 AM IST

బీర్ సీసాతో దాడి.. నిందితులపై కేసు నమోదు

W.G: కొవ్వూరు మండలం దొమ్మేరులో ఓ వ్యక్తిపై ఆదివారం బీరు సీసాతో దాడిచేసిన ఘటన చోటుచేసుకుంది. దాడి చేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు పట్టణ పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన మారి, ఫణి ఆదివారం మధ్యాహ్నం మహేశ్‌తో గొడవపడి దుర్భాషలాడారు. అనంతరం అతని ఇంటికి వెళ్లి మహేశ్‌ను కొట్టి, బీరు సీసాతో గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిప...

December 2, 2024 / 09:15 AM IST

రివాల్వర్‌తో కాల్చుకొని ఎస్సై ఆత్మహత్య

ములుగు: వాజేడు ఎస్సై హరీష్ నేడు (సోమవారం) ఆత్మహత్య చేసుకున్నాడు. వాజేడు మండలం ముళ్ళకట్ట వద్ద వున్న రిసార్ట్‌లో రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

December 2, 2024 / 09:14 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు

NZB: ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామ శివారులో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి ఆర్మూర్ వైపు వెళ్తున్న లారీ హార్వెస్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. క్షతగాత్రులను నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

December 2, 2024 / 09:08 AM IST

విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేసిన దుండగులు

ATP: యాడికి మండలం చందన గ్రామంలో గుర్తు తెలియని దుండగులు పొలాల్లో ఉన్న నాలుగు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేశారు. కాపర్ వైర్లు, ఆయిల్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దొంగలను పట్టుకోవడం కోసం సీఐ వీరన్న ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టారు.

December 2, 2024 / 09:06 AM IST

హైదరాబాద్‌ ఓయోలో డ్రగ్స్ పార్టీ

TG: హైదరాబాద్, మాదాపూర్‌లో డ్రగ్స్ పార్టీ కలకలంరేగింది. ఓయోలో జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. దాడుల్లో కొరియోగ్రాఫర్ కన్హ మహంతి, ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డి పట్టుబడ్డారు. ప్రియాంక రెడ్డి ఇచ్చిన పార్టీలో మహంతి పాల్గొన్నాడు. పార్టీలో ఎండీఎంఏతో పాటు మరో రెండు రకాల డ్రగ్స్‌ను పట్టుకున్నారు.

December 2, 2024 / 08:58 AM IST

ఓయోలో డ్రగ్స్ పార్టీ.. పట్టుబడ్డ కొరియోగ్రాఫర్

TG: హైదరాబాద్, మాదాపూర్‌లో డ్రగ్స్ పార్టీ కలకలంరేగింది. ఓయోలో జరుగుతున్న డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. దాడుల్లో కొరియోగ్రాఫర్ కన్హ మహంతి, ఆర్కిటెక్ట్ ప్రియాంక రెడ్డి పట్టుబడ్డారు. ప్రియాంక రెడ్డి ఇచ్చిన పార్టీలో మహంతి పాల్గొన్నాడు. పార్టీలో ఎండీఎంఏతో పాటు మరో రెండు రకాల డ్రగ్స్‌ను పట్టుకున్నారు.

December 2, 2024 / 08:58 AM IST

విద్యుత్ షాక్ కు గురైన యువకుడు మృతి

ATP: కూడేరు మండలం చోళసముద్రానికి చెందిన చిట్రా శివ ప్రైవేట్ విద్యుత్ హెల్పర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గత నెల 2న ఓ రైతు పొలంలో మరమ్మతుల కోసం వెళ్లిన ఆయన షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు అనంతపురంలోని సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సకు స్పందించక ఆదివారం మృతిచెందాడు. శివకు భార్య ఆశ, కుమార్తె ఉన్నారు.

December 2, 2024 / 08:50 AM IST

రోడ్డు ప్రమాదంలో మున్సిపాలిటీ అటెండర్ మృతి

MBNR: జడ్చర్లలోని 44వ జాతీయ రహదారిపై కృష్ణయ్య అనే వ్యక్తి ఆదివారం రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. జడ్చర్ల మున్సిపాలిటీలో అటెండర్‌గా పని చేసేవాడని స్థానికులు అన్నారు. కృష్ణయ్య మృతి చెందడం బాధాకరమని మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి విచారం వ్యక్తం చేశారు.

December 2, 2024 / 08:40 AM IST

స్టేడియంలో ఘర్షణ.. 100 మంది మృతి

పశ్చిమాఫ్రికా దేశం గినియాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో అభిమానుల మధ్య జరిగిన ఘర్షణలో 100 మంది మృతి చెందారు. మ్యాచ్‌ జరుగుతుండగా రెండు వర్గాల అభిమానుల మధ్య చోటు చేసుకున్న విపరీతమైన గొడవలో ఈ దారుణం చోటు చేసుకుంది. మృతదేహాలు వీధుల్లో చెల్లాచెదురుగా పడ్డాయి.

December 2, 2024 / 08:34 AM IST