HYD: మలక్పేట మెట్రోస్టేషన్ వద్ద అగ్నిప్రమాదం జరగడం నగరంలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తాజాగా కుట్రకోణం వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి బైకులను తగలబెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. మెట్రోస్టేషన్ కింద పెట్రోల్ డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.