ప్రకాశం: సంతమాగులూరు మండలంలోని కొమ్మలపడు వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్‌ను ట్యాంకర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ కరిముల్లాకు స్వల్ప గాయాలు కావడంతో స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించి నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.