KDP: చెన్నూరు మండలంలోని ఓబులంపల్లె పంచాయతీ పరిధిలోని వాటర్ గండి వద్ద పెన్నా నది నీటిలో శుక్రవారం యువకుడు గల్లంతయ్యాడు. కడప పట్టణం అశోక్ నగర్‌కు చెందిన దాట్ల యోహన్ అనే యువకుడు విహారయాత్రకు వాటర్ గండి ప్రాంతానికి వచ్చాడు. నదిలో ఈత ఆడుతూ ప్రమాదవశాత్తు పెన్నా నది నీటిలో గల్లంతయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.