విశాఖలోని RKనగర్ లేఔట్లో శుక్రవారం పట్టపగలు దొంగతనం జరిగింది. ఓలేటి ధనలక్ష్మి భర్త శ్రీనివాసరావు ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఇంటికి లాక్ వేసి పూలకుండీలో తాళం ఉంచి ఆసుపత్రికి వెళ్లారు. దొంగలు ఇంట్లోకి చొరబడి సుమారు 5 తులాలకు పైగా బంగారం అపహరించుకుపోయారు. పిల్లలు పాఠశాల నుంచి వచ్చే సరికి తలుపులు తీసి ఉండటంతో దొంగతనం జరిగిందని గుర్తించారు.