పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన అత్యవసరంగా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో(IB) డైరెక్టర్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ విభాగం(RAW) చీఫ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో దాడికి దారితీసిన పరిస్థితులు, భద్రతా వైఫల్యాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.