కృష్ణా: మినుము కొనుగోలులో దళారుల ప్రమేయాన్ని నివారించాలని మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. గురువారం మచిలీపట్నంలో జరిగిన డీఆర్సీ సమావేశంలో పాల్గొన్న ఆయన వ్యవసాయ శాఖపై జరిగిన సమీక్షలో మాట్లాడారు. మద్దతు ధర రావడం లేదని రైతుల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై దృష్టిసారించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రైతుకు అందేలా చూడాలన్నారు.