KMM: ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఐదో మహాసభలు ఏప్రిల్ 26 నుంచి 28 వరకు ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో జరగనున్నాయి. ఇది 2002 తర్వాత ఖమ్మంలో నిర్వహించనున్న తొలి మహాసభలు కావడంతో ప్రత్యేక ఆకర్షణగా మారింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈ స్థాయిలో జరుగుతున్న ఈ మహాసభల్లో రాష్ట్రంలోని 33 జిల్లాలు, 16 యూనివర్సిటీల నుంచి 600 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు.