MBNR: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని షాద్నగర్ పట్టణ సీనియర్ సివిల్ జడ్జిగా స్వాతి రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు నర్వ వేణుగోపాల్, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, జాయింట్ సెక్రెటరీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.