ప్రకాశం: మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలోని పశువుల కోసం నిర్మించిన నీటి తొట్లను గురువారం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాద్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు. పశువుల కాపర్లు నీటి తోట్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.