VZM: కౌమార దశలో ఉన్న బాల బాలికలకు తల్లిదండ్రులే నైతిక విలువలు నేర్పించాలని ఆర్జేడీ చిన్మయిదేవి సూచించారు. పట్టణంలోని కన్వెన్షన్ కేంద్రంలో సీడీపీవోలకు గురువారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కౌమార దశలో ఉన్న బాల, బాలికలకు మానసికంగా, ఆలోచనా పరంగా మార్పులు చోటు చేసుకుంటాయన్నారు.