తెలుగుదేశం పార్టీ కేవలం ఏపీలోనే కాకుండా అండమాన్, నికోబార్ దీవుల్లోనూ సత్తా చాటింది. అండమాన్-నికోబార్‌లోని మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవికి జరిగిన ఎన్నికలో బీజేపీ మద్దతుతో టీడీపీ అభ్యర్థి షాహుల్ హమీద్ విజయం సాధించారు. పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి టీడీపీకి చెందిన మహిళా కార్పొరేటర్ సెల్వికి దక్కింది.