ప్రకాశం: మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ను తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో గురువారం కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు విషయాలు చర్చించారు. జగన్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, అన్ని విధాలుగా నీకు అండగా నేను ఉన్నానని భరోసా ఇచ్చినట్లు ఆయన తెలిపారు.