HNK: ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ వేదికను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సభా ప్రాంగాణంతో పాటు పార్కింగ్ స్థలాలు, సభకు తరలి వచ్చే మార్గాలను బీఆర్ఎస్ నాయకులను అడిగి తెలుసుకున్నారు. సీపీ వెంట డీసీపీ అంకిత్ కుమార్ పోలీస్ అధికారులు ఉన్నారు.