ప్రకాశం: బల్లికురవ మండలంలోని రామాంజనేయపురం గ్రామంలో నిన్న జరిగిన ఘర్షణ కేవలం ఇరు కుటుంబాలు మధ్య వివాదం నేపథ్యంలో జరిగిందని సంతమాగులూరు సిఐ వెంకటరావు తెలిపారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. గ్రామంలో జరిగిన ఘర్షణలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని అన్నారు. అలాగే ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశామని అన్నారు.