ASR: ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్లో ఆదివాసీలకు అన్యాయం జరిగిందని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర, జిల్లా కార్యదర్శి బాలదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు గురువారం గిరిజన సంఘం అరకు మండల కార్యదర్శి బుజ్జిబాబు అధ్యక్షతన అరకులో రాస్తారోకో నిర్వహించారు. ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు.