నెల్లూరు: టౌన్ రాజేంద్రనగర్ సెక్షన్ పరిధిలో అధిక లోడు వాడుతున్న విద్యుత్ వినియోగదారులు ప్రభుత్వం అందించే 50% అదనపు లోడు రాయితీని సద్వినియోగం చేసుకోవాలని ఏఈ వెంకట రమణయ్య కోరారు. సెక్షన్ పరిధిలో మొత్తం 23, 855 సర్వీసులు ఉన్నాయని చెప్పారు. సుమారుగా 3,863 సర్వీసులు అదనపు లోడు కట్టాల్సి వస్తోందన్నారు. వీరందరూ రాయితీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.