CTR: చిత్తూరు నగరంలోని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన కార్యాలయ ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.