ప్రకాశం: మార్టూరులోని క్యాంపు కార్యాలయం నందు గురువారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొని ఆయా గ్రామాల ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారులకు బదలాయించి వెంటనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రజలకు భరోసా ఇచ్చారు.