SRD: నారాయణఖేడ్ మండలం అబ్బెంద శివారు కింది తండాలో సాగుతున్న గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ అధికారులు గురువారం తెలిపారు. తండాకు చెందిన చందర్ కు చెందిన వ్యవసాయ భూమిలో సాగులో ఉన్న 5 గంజాయి చెట్లను తొలగించి, కేసు నమోదు చేశామన్నారు. నిందితుడు చందర్ పరారీలో ఉన్నాడని త్వరలో పట్టుకుంటామని ఎక్సైజ్ అధికారులు శంకర్, అనుదీప్ తెలిపారు.