TPT: తిరుపతి పరిసర ప్రాంతాల్లోని చెరువుల ఆధునీకరణ పనులు శరవేగంగా పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. చెరువుల ఆధునికరణ పనులపై అధికారులతో ఆయన కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. చెరువుల్లో నీటి నిలువలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. చెరువు కట్టలను బలోపేతం చేయడంతో పాటు వాకింగ్ ట్రాక్ పచ్చని చెట్లు ఏర్పాటు చేస్తామన్నారు.