WGL: భద్రకాళి అమ్మవారిని గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా కలకాలం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ చీఫ్ వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.