TG: వరంగల్ రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ హత్య కేసును పోలీసులు చేధించారు. యూట్యూబరే హంతకుడని తేల్చారు. అప్పు ఇవ్వలేదన్న కోపంతో కిరాతకంగా హత్య చేసినట్లు తెలిపారు. నిందితుడు మేనేజర్‌కు మద్యం తాగించి కర్రతో కొట్టిచంపాడు. మృతుడి ఒంటిపై ఉన్న బంగారం దోచుకెళ్లాడు. పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. ములుగు జిల్లా కోమటిపల్లికి చెందిన శ్రీనుగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.