TG: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్లు మరణించిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జరిగింది. బైక్పై వెళ్తున్న కానిస్టేబుళ్లను జాలిగామ బైపాస్ రోడ్డు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. వారిద్దరూ HYDలో మారథాన్లో పాల్గొనడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు రాయపోల్ PSలో విధులు నిర్వహించే పరంధాములు, దౌల్తాబాద్ పీఎస్లో పనిచేసే పూస వెంకటేశ్వర్లుగా గుర్తించారు.