NLR: పల్నాడు జిల్లా బ్రాహ్మణపల్లి సమీపంలో అద్దంకి – నార్కట్పల్లి హైవేపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కావలి మండలం సిరిపురానికి చెందిన తుళ్లూరు సురేశ్, వనిత, యోగులు, వెంకటేశ్వర్లు మృతి చెందారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొత్తకారుకు పూజలు చేయించేందుకు వీరంతా కొండగట్టుకు వెళ్లారు.