TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-బైకు ఢీకొనటంతో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మరణించారు. అశ్వారావుపేట సమీపంలోని ఓ తోటలో కూలి పనికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.