• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

‘ఈ పాపం ఎవరిది – విద్యుత్ షాక్‌తో ఎద్దులు మృత్యువాత’

VZM: బొబ్బిలి మండలంలోని కొత్తపెంటలో విద్యుత్ షాక్తో రెండు ఎద్దులు మృతి చెందాయి. కొత్తపెంట చెరువులో తెగి పడి ఉన్న వైర్లు తాకడంతో రైతు బేతనాపల్లి తిరుపతికి చెందిన రెండు ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ప్రమాదంలో రైతు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. విద్యుత్ ప్రమాదంలో ఎద్దులు మరణించిన రైతుకు నష్టపరిహారం చెల్లించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు, నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 

September 28, 2024 / 06:58 AM IST

భారీ విధ్వంసం.. 35 మంది మృతి

అమెరికాలో హెలీన్ హరికేన్ భారీ విధ్వంసం సృష్టించింది. తుపాను ధాటికి ఇప్పటివరకు 35 మంది మృతి చెందారు. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో తుపాను విరుచుకుపడింది. తుపాను కారణంగా ఆగ్నేయ అమెరికా అంతటా అపార ఆస్తి నష్టం కలిగింది. వందల మందిని పడవల సాయంతో విపత్తు నిర్వహణ బృందాలు రక్షించాయి. ఉత్తర కరోలినాలో వరదలు పోటెత్తడంతో.. కార్లు కొట్టుకుపోయాయి.

September 28, 2024 / 06:45 AM IST

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్టు

VSP: పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మధురవాడ వద్ద గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు ఎస్సై భాస్కర్ సిబ్బందితో వెళ్లి నిఘా పెట్టినట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన హనుమంతు జగదీష్ స్థానిక వుడా కాలనీకి చెందిన ఐ శ్రీకాంత్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు.

September 28, 2024 / 06:06 AM IST

11 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్

ఏలూరు: ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెం పేకాట శిబిరంపై ఎస్సై సుధీర్ బాబు శుక్రవారం దాడి చేశారు. ఈ దాడిలో 11 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి నుంచి రూ.15,120 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎస్సై మాట్లాడుతూ..పేకాట, కోడి పందేలు నిర్వహిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని స్పష్టం చేశారు.

September 28, 2024 / 05:44 AM IST

కొడుకుపై ర్యాగింగ్… ఆర్పీ పట్నాయక్ ఫిర్యాదు

TG: సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కొడుకు వైష్ణవ్ ర్యాగింగ్‌కి గురయ్యాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో వైష్ణవ్ ఎంబీఏ చదువుతున్నాడు. అదే కాలేజీకి చెందిన సీనియర్ విద్యార్థి శ్యామ్, వైష్ణవ్‌తో బస్‌లో గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే శ్యామ్ ఆవేశంలో వైష్ణవ్ చెవిని కొరికేశాడు. దీంతో ఆర్పీ పట్నాయక్ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

September 27, 2024 / 04:52 PM IST

రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుంటూ గుండెపోటుతో మృతి

ప్రకాశం: ప్రమాదంలో గాయపడి కోలుకుంటూ గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందిన విషాద సంఘటన కంభం మండలం దేవనగరంలో జరిగింది. గ్రామానికి చెందిన అశోక్ 15 రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆటో ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న అశోక్ శుక్రవారం గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబసభ్యులు కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించి వైద్యులు మృతి చెండాడాని నిర్ధారించారు....

September 27, 2024 / 04:17 PM IST

రెండు వాహనాలు ఢీ ఒకరు మృతి మరొకరికి గాయాలు

ప్రకాశం: పెద్దారవీడు మండలం తోకపల్లి- గొబ్బూరు రహదారి మధ్య శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనం, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు… పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

September 27, 2024 / 04:17 PM IST

బీరువా తాళాలు పగలగొట్టి దోచుకెళ్లిన దొంగలు..!

BDK: గుర్తుతెలియని వ్యక్తులు బీరువా తాళాలు పగలగొట్టి బంగారం నగలు చోరీ చేసిన ఘటనపై పినపాక పోలీస్ స్టేషన్ శుక్రవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పినపాకకు చెందిన ఏలేటి సంజీవరెడ్డి అనారోగ్య చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కి వెళ్ళగా, దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగలగొట్టి దొంగతనం చేసినట్టుగా పోలీసులు తెలిపారు.

September 27, 2024 / 03:43 PM IST

VIDEO: అసరాడ జంక్షన్ వద్ద 860 కిలోల గంజాయి స్వాధీనం

ASR: ముంచంగిపుట్టు మండలం అసరాడ జంక్షన్ వద్ద 860 కిలోల గంజాయి పట్టుబడిందని పాడేరు అదనపు ఎస్పీ ధీరజ్ శుక్రవారం తెలిపారు. ముందస్తు సమాచారంతో ముంచంగిపుట్టు ఎస్సై తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా బొలెరో వాహనంలో తరలిస్తున్న గంజాయి పట్టుబడిందని చెప్పారు. ఈమేరకు గంజాయితో పాటు వాహనం స్వాధీనం చేసుకుని గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు.

September 27, 2024 / 03:09 PM IST

బంగారు గనిలో ప్రమాదం.. 15 మంది మృతి

ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో ఉన్న ఓ బంగారు గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా గనిలో కొండచరియలు విరిగిపడి 15 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. కొందరు వ్యక్తులు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

September 27, 2024 / 02:50 PM IST

‘లారీని ఢీకొట్టిన మరో లారీ.. విరిగిన డ్రైవర్ కాలు’

ప్రకాశం: సింగరాయకొండలోని లారీ యూనియన్‌ ఆఫీస్‌ ఎదురుగా కలకత్తా నుంచి బెంగళూరుకు వెళుతున్న కూరగాయల లారీని,మరో లారీ ఎదురుగా ఢీకొట్టిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో కూరగాయల లారీ డ్రైవర్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను జేసీబీ సహాయంతో బయటకు తీశారు.కాగా డ్రైవర్‌కు కాలు నలిగి విరిగిందని ...

September 27, 2024 / 02:48 PM IST

కొనసాగుతున్న జానీ మాస్టర్ కస్టడీ విచారణ

TG: నార్సింగి పోలీస్ స్టేషన్‌లో జానీ మాస్టర్ కస్టడీ విచారణ  కొనసాగుతుంది. మూడో రోజు బాధితురాలు స్టేట్మెంట్‌ను జానీ మాస్టర్ ముందుంచి పోలీసులు విచారిస్తున్నారు. అయితే బాధితురాలే తనను వేధించిందని జానీ మాస్టర్ తెలిపారు. జానీ మాస్టర్‌ను కలిసేందుకు ఆయన భార్య నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. రేపటితో జానీ మాస్టర్ కస్టడీ విచారణ ముగియనుండటంతో.. రేపు ఉదయం కోర్టు ముందు ఆయన్ను ...

September 27, 2024 / 02:28 PM IST

భార్యపైన కత్తితో దాడి చేసిన భర్త

WGL: వర్ధన్నపేటలో భార్య మీద కోపంతో ఓ భర్త విచక్షణారహితంగా కత్తి, రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. అడొచ్చిన మామ పై కూడా దాడి చేయడంతో చేతికి, తలకు గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన ఆమెను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆమె మెడ చుట్టూ 33 కుట్లు పడగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

September 27, 2024 / 01:40 PM IST

మంత్రాలయం మండలంలో రోడ్డు ప్రమాదం

KRNL: మంత్రాలయం మండలం చిలకలడోనా శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్సై పరమేశ్ నాయక్ వివరాల మేరకు.. బెంగళూరు నుంచి మంత్రాలయానికి వస్తున్న కారును రోడ్డు పక్కన ఆపారు. ఈ క్రమంలో కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గకి చెందిన టెంపో వాహనం కారుని వెనక నుంచి ఢీకొంది. కారులో ఉన్న వికాస్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. టెంపో డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులన్నారు.

September 27, 2024 / 01:38 PM IST

శ్రీ చైతన్య కాలేజీలో 100 మంది బాలికలకు అస్వస్థత

TG: శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల 100 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మాధాపూర్‌లో ఉన్న శ్రీ చైతన్య కాలేజీ అక్షర కో గర్ల్స్ క్యాంపస్‌లో చోటుచేసుకుంది. దీంతో విద్యార్థినులను సమీపంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే యాజమాన్యం మాత్రం వైరల్ ఫీవర్ వచ్చిందని, వర్షాల వల్ల పిల్లలకు వాంతులు, విరేచనాలు అయ్యినట్లు తెలుపుతున్నారు.

September 27, 2024 / 01:30 PM IST