PPM: పార్వతీపురం మండలం తాళ్లబురిడి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బలగ శంకర్రావుకు చెందిన నాలుగు ఎకరాల వరిగడ్డి కుప్పలు దగ్ధమయ్యాయి. వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు రూ.20,000 ఆస్తి నష్టం జరిగిందని శంకర్రావు తెలిపారు.