కేరళ రాష్ట్రం కొల్లాం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్యన్కావు గ్రామంలో అతివేగంగా వచ్చిన లారీ శబరిమల భక్తులతో వెళ్తున్న బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ భక్తుడు మృతి చెందారు. చిన్నారులు, వృద్దులతో సహా 16 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.