BPT: బాపట్ల మండలం అడవి పంచాయతీ హనుమత్ నగర్లోని ఓ వివాహితపై వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మద్దిబోయినవారిపాలెంకి చెందిన ఓ వ్యక్తి తనతో శారీరకంగా ఉండాలని వివాహితను బెదిరించాడు. అయితే వివాహిత దానికి అంగీకరించకపోవటంతో విచక్షణా రహితంగా కొట్టి గాయపరిచాడు. వివాహితకు బాపట్ల ఏరియా వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు.