విజయవాడకు చెందిన ఓ మహిళ ఆర్మీలో పనిచేసే వ్యక్తి చేతిలో మోసపోయారు. మురళీనగర్కు చెందిన మహిళ (45)కు పశ్చిమబెంగాల్లోని ఆర్మీలో పనిచేసే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈక్రమంలో అతని పిలుపు మేరకు ఆమె అక్టోబర్ 8న పశ్చిమ బెంగాల్ వెళ్లారు. అప్పుడు అతనికి రూ. 8లక్షలు ఇచ్చి విజయవాడ వచ్చారు. ఆ తర్వాత డబ్బులు అడిగితే ఇవ్వకుండా తిట్టడం ప్రారంభించాడు.