ఢిల్లీ(Delhi)లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం(Delhi International Airport)లో రూ.21కోట్లు విలువ చేసే మూడు కేజీల హెరాయిన్(Heroin)ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. కెన్యా(Kenya) నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద భారీ మొత్తంలో ఈ హెరాయిన్ ను గుర్తించారు అధికారులు.
లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయి. రికవరీ ఏజెంట్ల వల్ల అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఆర్బీఐ మార్గదర్శకాలను రూపొందించింది.
తేనే కోసం వెళ్తే రాజధాని నిర్మాణ సామగ్రి కాలి బూడిదైంది. సీఎం జగన్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం సంభవించిందని రాజధాని ప్రాంత రైతులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.
TSPSC పేపర్ లీకేజీ కేసు(TSPSC leakage case)లో సిట్ అధికారులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటివరకు అరెస్టైన వారి సంఖ్య 19కి పెరిగింది. మరోవైపు హైకోర్టులో ఈ కేసు విచారణ ఈనెల 24న జరగనుంది.
హైదరాబాద్ సనత్‌నగర్ బాలుడి హత్య కేసులో ట్విస్ట్ ఎదురైంది. అయితే అసలు బాలుడిని హిజ్రానే చంపేశాడని తేలింది. కానీ అసలు కారణం మాత్రం అమావాస్య కాదు. ఏంటో తెలుసుకోవాలంటే ఈ వార్తను చదవాల్సిందే.
హైదరాబాద్‌లోని సనత్‌నగర్(Hyderabad sanath nagar)లో విషాదం చోటుచేసుకుంది. సనత్‌నగర్‌లోని అల్లావుద్దీన్ కోటి ప్రాంతంలోని కాలువలో అబ్దుల్ వాహిద్ అనే ఎనిమిదేళ్ల బాలుడి మృతదేహం లభ్యమైంది. అయితే అమావాస్య కావడంతో బాలుడిని బలితీసుకున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం తల్లి ఒంటరిగా ఏలూరులో నివసిస్తోంది. ప్రస్తుతం చివరి సెమిస్టర్ చదువుతున్నాడు. 10 రోజుల్లో మాస్టర్స్ పూర్తయి స్వదేశానికి రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇలాంటి సమయంలో ఈ ఘోరం జరగడంతో ఆ తల్లి దిగ్భ్రాంతికి లోనైంది.
హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ తెలుగు టీవీ నటి ఇంట్లో పెద్ద చోరీ(Big theft) జరిగింది. దీంతో కిలోకుపైగా గోల్డ్, వెండి ఆభరణాలను దొంగలు దోచుకెళ్లినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఓ పెళ్లి మండపంలో అందరూ పెళ్లి హడావిడిలో సరదాగా గడుపుతున్నారు. అదే క్రమంలో ఒక్కసారిగా కరెంట్ పోయింది. ఆ తర్వాత పెళ్లి మండపం నుంచి ఒక్కసారిగా అరుపులు, శబ్దాలు వినిపించాయి. ఏం జరిగిందని తెలుసుకునే లోపే అనేక మంది గాయపడ్డారు. ఆ తర్వాత ఎవరో యాసిడ్ దాడి చేశారని తెలుసుకున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా(chhattisgarh bastar district)లో జరిగింది.
చైన్ స్నాచర్లు జనాలను భయపెడుతున్నారు. తాజాగా అడ్రస్ కోసం వచ్చిన ఇద్దరు యువకులు మహిళ మెడలో చైన్ దొంగిలించిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన సీసీ కెమెరా వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఉగ్రవాదులు గ్రనేడ్లు విసరడం వల్ల అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు జవాన్లు మరణించారు. అధికారులు అలర్ట్ అయ్యి ఉగ్రవాదుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జిల్లా పరిషత్ హైస్కూల్లో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. క్లాస్ రూంలో పరీక్ష రాస్తుండగా, 9వ తరగతి విద్యార్థుల మధ్య గొడవ మొదలైంది. ఆ క్రమంలో అది కాస్తా కత్తులతో పొడుకునే స్థాయికి చేరింది. మరోవైపు ఇదంతా టీచర్ ముందే జరుగుతుండటం విశేషం. ఆ నేపథ్యంలో సాయి అనే విద్యార్థిని మరో స్టూడెంట్ శంకర్ చాకుతో పొడిచాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ క్రమంలో అప్రమత్తమైన ప్రధా...